తెలంగాణ రాజకీయం: రేవంత్ చూపు చంద్రబాబు వైపు
టీఆర్ఎస్ కు వ్యతిరేంగా విమక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న రేవంత్ రెడ్డి సరికొత్త ఈక్వేషన్ తెరపైకి తెచ్చారు. నియంతగా వ్యవరిస్తున్న కేసీఆర్‌ను గద్దెదించాలంటే కాంగ్రెస్, టీడీపీ ఐక్యం కావాల్సిన అవసరముందని వ్యాఖ్యనించారు. కాంగ్రెస్‌తో టీడీపీ జతకడితే కేసీఆర్ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు.
తెలంగాణలో బీహార్ ఫార్మాలా
తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించాలంటే విపక్షాల ఐక్యత తప్పనిసరి అని రేవంత్ వ్యాఖ్యానించారు. మోడీ హవా బలంగా వీస్తున్నప్పటికీ బీహార్ లో విపక్షాల ఐక్యతోనే బీజేపీ ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నారు.. బీహార్ ఫార్ములా తెలంగాణలోనూ అమలు చేయాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య చర్చలు జరుగుతాయని భావిస్తున్నట్టు తెలిపారు.