Rushikonda Palace: అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరిట విశాఖపట్టణంలో మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఓ భవనం నిర్మించారు. ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయంగా ఈ భవనం నిర్మించగా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రిషికొండను తవ్వి భవనం నిర్మించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై న్యాయస్థానాల్లో కూడా విచారణ జరుగుతోంది. అయితే అనూహ్యంగా వైఎస్‌ జగన్‌ అధికారం కోల్పోయారు. దీంతో జగన్‌ ప్రభుత్వం నిర్మించిన రిషికొండ భవనం హాట్‌ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా ఆ భవనాన్ని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌ రావు పరిశీలించారు. భవనం పరిశీలించిన అనంతరం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: ముఖ్యమంత్రి అయ్యి 24 గంటలు కాలేదు.. అప్పుడే చంద్రబాబుపై ప్రశంసల వర్షం


 


ఈ సందర్భంగా భవనంలోని సదుపాయాలను పరిశీలించి జగన్‌ తీరుపై మండిపడ్డారు. ఈ భవనంలో బాత్‌ టబ్‌ విలువ రూ.28 లక్షలు అని తెలిపారు. గెలిచిన తర్వాత తన వైఎస్‌ భారతికి బీచ్‌ వ్యూతో కూడిన ఇల్లు గిఫ్ట్‌గా ఇస్తానని జగన్‌ చెప్పినట్లు వివరించారు. 'రుషికొండ నిర్మాణాల ఉత్కంఠ ఈరోజు తెరపడింది. ఇక్కడ ఏం జరుగుతుందనేది తెలుసుకుందామని వస్తే ఎన్నో అక్రమ కేసులు బనాయించారు. పచ్చటి టూరిజం రిసార్ట్‌ను అన్యాయంగా కూల్చివేసి విలాసవంతంగా కట్టడాలను కట్టారు. రుషికొండ నిర్మాణాలపై అన్ని వివాదాలే. పచ్చటి కొండను జగన్‌ గుండు చేశారు' అని విమర్శించారు.

Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం


'రిషికొండపై ఎంతో ముచ్చట పడి కట్టుకున్నారు కానీ చివరికి ఆయన చూసుకోకుండా ప్రజలు ఆయనకు సరైన తీర్పు ఇచ్చారు. వైఎస్ఆర్‌సీపీ మునిపోతున్న పడవ అని గతంలోనే చెప్పాను. ఇప్పుడు అది మునిగిపోయిన పడవ. విశాఖలో రాజధాని వద్దు అని భీమిలి నియోజకవర్గంలో అత్యంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించి జగన్‌కు బుద్ధి చెప్పారు. మూర్ఖుడు రాజు ఐతే ఇలా ఉంటుందో రాష్ట్రంలో అందరం చూశాం' అని గంటా శ్రీనివాస రావు విమర్శించారు.


చంద్రబాబుతో చర్చిస్తా
రిషికొండపై రూ.500 కోట్లు పెట్టీ నిర్మించిన ఈ నిర్మాణాలపై ఏం చేయాలో ఆలోచిస్తాం. ఈ భవనాన్ని ఏం చేయాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తా. త్వరలోనే విశాఖకు సీఎం చంద్రబాబు పర్యటన ఉంటుంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter