Outsourcing Employees Salaries: విద్యుత్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
Outsourcing Employees Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో పనిచేసే దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఊహించని కానుక అందినట్లయింది.
Outsourcing Employees Salaries: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్తు శాఖలో పనిచేస్తోన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులకు జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం 37 శాతం వేతనాలు పెంచింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలోని దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీంతోపాటు ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ శాఖలోని పొరుగు సేవల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో విద్యుత్ శాఖలో పనిచేసే దాదాపు 27,000 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఊహించని కానుక అందినట్లయింది.
రూ.21 వేలకు పెరగనున్న ఉద్యోగుల ఆదాయం..
ఇటీవల పెరిగిన జీతాల వల్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆదాయం రూ.21వేలకు పైకి చేరింది. అదనంగా, ఉద్యోగులకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యుత్ శాఖలోని అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సానుకూల ప్రభావం చూపుతుందని, వారికి మెరుగైన వేతనం, బీమా కవరేజీని అందజేస్తుండటంతో ఇకపై వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మెలు, రాస్తారోకోలు అని ధర్నాలకు దిగకుండా అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తోంది.