Special Trains: సంక్రాంతికి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
Special Trains From Secunderabad To Kakinada: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు సరదాగా జరుపుకుంటారు. కోడి పందేలు ఇతరత్రా కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు.
Special Trains From Secunderabad To Kakinada: సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సంబరాలు సరదాగా జరుపుకుంటారు. కోడి పందేలు ఇతరత్రా కార్యక్రమాలతో సంతోషంగా గడుపుతారు. అయితే హైదరాబాద్ నుంచి ఏపీలోని సొంతూరుకు ఇంటికి వెళ్లేవారు, ఆపై తిరిగి రావాలన్నా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసిన కొత్త రైలు సర్వీసులపై ఆధారపడక తప్పదు.
సంక్రాంతి పండగ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడుపుతోంది. కాకినాడ టౌన్ - సికింద్రాబాద్(07436) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రకటించింది. జనవరి 12 నుంచి జనవరి 17 వరకు ఈ రైలు సర్వీస్ అందుబాటులో ఉండనుంది. నర్సాపూర్ - సికింద్రాబాద్ (07441) ప్రత్యేక రైలు మొత్తం 4 సర్వీసులు అందిస్తుందని తెలిపారు.
Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు
అదే విధంగా లింగంపల్లి నుంచి కాకినాడ పోర్టుకు ప్రతిరోజూ రైలు సర్వీస్(02738) నడపనున్నారు. కాచిగూడ - చిత్తూరు (02797) రైలు సర్వీస్, లింగంపల్లి - తిరుపతి(02734) సర్వీసులు ప్రతిరోజూ నడపుతున్నట్లు ద.మ.రైల్వే ప్రకటించింది. వీటితో పాటు సికింద్రాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు సైతం మరెన్నో రైలు సర్వీసులను పండుగ రద్దీ నేపథ్యంలో నడుపుతోంది.
Also Read: Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్
కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు.. సామర్లకోట, అనపర్తి, రాజమహేంద్రవరం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఆకవీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగుతుంది. పండుగ తర్వాత తిరిగి రావడానికి కూడా ఈ సర్వీసులు సామాన్యుడికి చేదోడుగా ఉండనున్నాయి.
Also Read: Reliance Jio: డేటా కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్.. పూర్తి వివరాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook