AP Schools, Colleges: స్కూల్, కాలేజీల్లో పాఠాలు మొదలయ్యే తేదీలివే
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విద్యా విధానం, పాఠశాలలు, కళాలల నిర్వహణ విషయంలో మంత్రి సురేష్ కీలక ప్రకటన చేశారు. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సుమారు 7 నెలల నుంచి స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూసి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు విద్యా విధానం, పాఠశాలలు, కళాలల నిర్వహణ విషయంలో మంత్రి సురేష్ కీలక ప్రకటన చేశారు. కరోనావైరస్ ( Coronavirus) వల్ల సుమారు 7 నెలల నుంచి స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూసివేసి ఉన్నాయి. 2020-21 విద్యా సంవత్సరం గురించి కలవర పడుతున్న వారి కోసం ప్రభుత్వం అనేక విధానాలు పాటిస్తోంది.
Also Read | జేమ్స్ బాండ్ నటుడు సీన్ కానరీ గురించి ఆసక్తికరమైన విషయాలు
ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh ) మంత్రి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..
9,10,12వ క్లాసులను నవంబర్ 2వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభిచనున్నారు.
ఇంటర్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ 16 నుంచి మొదలుపెట్టనున్నారు
బీటెక్ మొదటి సంవత్సరం క్లాసులను డిసెంబర్ 1 వతేదీ నుంచి , బీటెక్, బీ ఫార్మా సీనియర్ విద్యార్థులకు క్లాసులను నవంబర్ 2 నుంచి ప్రారంభించనున్నారు.
Also Read | Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు 50 శాతం Cashback
Also Read: AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం
ఇక రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకుల పాఠశాలలు, 6,7,8 క్లాసులను నవంబర్ 23 నుంచి ప్రారంభించనున్నారు.
డిసెంబర్ 14వ తేదీ నుంచి మొదటి తరగతి నుంచి 5వ క్లాసు వరకు తరగతులు మొదలు పెడతారు.
ఇక విద్యాసంవత్సరం ముగింపును 2021 ఆగస్టుకు పొడగించారు.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR