వంశధార నదిలో చిక్కుకున్న కూలీలు సురక్షితం
శ్రీకాకుళం వంశధార నది వరద ఉధృతిలో చిక్కుకున్న 55 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
శ్రీకాకుళం వంశధార నది వరద ఉధృతిలో చిక్కుకున్న 55 మంది కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వద్ద నదీగర్భంలోని ర్యాంపులో ఇసుక తవ్వుతుండగా ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో కూలీలందరూ నదిలో మధ్యలోని ఇసుకదిబ్బపై చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న అధికారులు వెంటనే ర్యాంపు వద్దకు చేరుకుని వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ప్రారంభించారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో వంశధార నదికి వరదనీరు పోటెత్తింది. దీంతో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం వంశధార నదీగర్భంలోని ర్యాంపులో ఇసుక తవ్వుతుండగా ఒక్కసారిగా వరద ఉధ్ధృతి రావడంతో నది మధ్యలోని దిబ్బపైన కూలీలందరూ చిక్కుకున్నారు. ర్యాంపులో ఉన్న ప్రొక్లెయిన్లు, లారీలు మొత్తం నీటమునిగాయి. సమాచారమందుకున్న అధికారులు వెంటనే ర్యాంపు వద్దకు చేరుకుని వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ప్రారంభించారు.