Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, 24 గంటల్లో ఆ ఆరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అతి భారీ వర్షాల ముప్పున్న జిల్లాలివే..
Heavy Rains: ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. అతి భారీ వర్షాల ముప్పున్న జిల్లాలివే..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో బలపడనుంది. ఫలితంగా ఏపీలో మరో 2-3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. వచ్చే 24 గంటల్లో విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఈ జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ వార్నింగ్ జారీ చేసింది.
తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు పశ్చి మ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా బలపడనుంది. ఫలితంగా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లినవారు తిరిగి రావాలని విజ్ఞప్తి చేసింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశాలున్నాయి. రవాణా వ్యవస్థకు అంతరాయం కలగనుంది. చెట్లు, విద్యుత్ స్థంభాలు కూలిపోయే ప్రమాదముంది.
వరి, అరటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశమున్నందున యంత్రాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీలోని విశాఖ, తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకూ ఏపీలోని పలుప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగనున్నాయని ఐఎండీ తెలిపింది.
Also read: Vijayawada: విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా సినీ హీరో నాగార్జున, జగన్ సరికొత్త వ్యూహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook