మసాజ్ సెంటర్ల మాటున వ్యభిచారం దందా
మసాజ్ సెంటర్, స్పా పేరిట గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం
బయట చూడ్డానికి మసాజ్ సెంటర్, స్పా అనే పేరుతో బోర్డులు ఏర్పాటు చేసిన పలు వ్యాపార కేంద్రాలు లోపల మాత్రం గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నాయని పక్కా సమాచారం అందుకున్న విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక పథకం ప్రకారం ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మొగల్రాజపురం, లబ్బీ పేట, గురునానక్ కాలనీల్లోని నాలుగు మసాజ్ సెంటర్లపై ఒకేసారి దాడులు నిర్వహించారు. ఆయా మసాజ్ సెంటర్లలో వ్యభిచారం జరుగుతోందని నిర్ణయించుకున్న పోలీసులు ఇద్దరు మహిళా నిర్వాహకులతోపాటు మరో 11 మంది మహిళలను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.
వ్యభిచారం నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న పలు మసాజ్ సెంటర్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం.