తెలుగుదేశం పార్టీకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది పార్టీ వీడగా..మరి కొంతమంది ఆ ప్రయత్నంలో ఉన్నారు. పార్టీ సీనియర్ నేతతో బీజేపీ నేతలిప్పుడు మంతనాలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ ( AP ) లో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ( Telugu desam party ) కు కష్టాలెదురవుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) వైఖరిపై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కన్పిస్తోంది. మూడు రాజధానుల విషయంలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతల్నించి బాహాటంగానే చంద్రబాబు ( Chandrababu ) తీరును తప్పుబట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ అంధకారమవుతుందనేది పార్టీ నేతల ఆలోచనగా ఉంది. 


ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీకు షాక్ మీద షాక్ ఎదురవుతోంది. ఇప్పుడు మరో కీలక నేత, పార్టీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావు ( Tdp senior leader Kala venkat rao ) పార్టీని వీడనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబుతోనే కాకుండా..జిల్లా నేతలతో కూడా అందుబాటులో ఉండటం లేదు. పార్టీలో తనకంటే జూనియర్ అయిన అచ్చెన్నాయుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పడంపై మరీ అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. టీడీపీలో అసంతృప్తులపై కన్నేసిన బీజేపీ..కళా వెంకట్రావుతో మంతనాలు జరుపుతోంది. బీజేపీ ( Bjp ) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ( Somu verraju ) రెండు మూడ్రోజుల్లో ఆయన్ను కలిసి..పార్టీలో ఆహ్వానించనున్నారని తెలుస్తోంది. 


Also read: Special Trains: సంక్రాంతికి సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook