AP Movie Ticket Issue: ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల విషయంలో ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులు, సినిమా వాళ్లు అనే విషయాన్ని పక్కన పెడితే ప్రేక్షకుల్ని అవమానించేలా ఈ నిర్ణయం ఉందన్నారు. ఈ మేరకు గురువారం ‘శ్యామ్‌సింగరాయ్‌’ చిత్రబృందం కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న నాని.. ఈ వ్యాఖ్యలు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించింది. ఏది ఏమైనా ఆ నిర్ణయం సరైనది కాదు. టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించింది. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉంది. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అయితే నేను ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదమే అవుతుంది" అని హీరో నాని వ్యాఖ్యానించారు.


నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన 'శ్యామ్ సింగరాయ్' చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 24న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలో నాని సరసన సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతమందించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Also Read: Shyam Singha Roy Tara Song: 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి 'తారా' సాంగ్ వచ్చేసింది!


Also Read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సర్ ప్రైజ్- 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి