RRR Movie 4th Single: RRR నుంచి మరో సర్ ప్రైజ్- 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్

RRR Movie 4th Single: రామ్​చరణ్-ఎన్టీఆర్ కాంబినేషన్​లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టార్ చిత్రం 'ఆర్​ఆర్​ఆర్'​. ఇటీవలే విడుదలైన ట్రైలర్ సహా బాలీవుడ్ లో జోరుగా ప్రమోషన్స్ ప్రారంభించడం వల్ల సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని నాలుగో పాట 'రోర్ ఆఫ్ భీమ్' ప్రోమోను గురువారం చిత్రబృందం విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 01:39 PM IST
    • RRR మూవీ నుంచి మరో సర్ ప్రైజ్
    • సినిమాలోని రోర్ ఆఫ్ భీమ్ సాంగ్ ప్రోమో రిలీజ్
    • శుక్రవారం ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్న చిత్రబృందం
RRR Movie 4th Single: RRR నుంచి మరో సర్ ప్రైజ్- 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్

RRR Movie 4th Single: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌' (రౌద్రం రణం రుధిరం- RRR). దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి గురువారం ఉదయం నాలుగో పాట 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో విడుదలైంది.

దీనికి సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఆర్ఆర్ఆర్ మేకర్స్ ప్రకటించారు. ఈ పాటను సంగీత దర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి కుమారుడు కాల భైరవ.. తెలుగు సహా ఇతర నాలుగు భాషల్లో ఆలపించారు. 

ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు చిరు, బాలయ్య

మరోవైపు 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం దర్శకుడు రాజమౌళి చేస్తున్న ప్రమోషన్ ప్లాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో పాటు రాజమౌళి బాలీవుడ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ముంబైలో ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగిందన్న విషయం తెలిసిందే. అది త్వరలోనే ఓ ఛానల్ లో ప్రసారం కానుంది. ఇక తాజాగా ప్రో కబడ్డీ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి చేసి అందరినీ ఆకట్టుకుంది. 

తాజాగా వినిపిస్తున్న బజ్ ప్రకారం జక్కన్న తన సినిమా కోసం టాలీవుడ్ మరోసారి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు టాలీవుడ్ బిగ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథులుగా విచ్చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సిఉంది. 

భారీ బడ్జెట్ మూవీ..

సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌గా సందడి చేయనున్నారు. అలియా భట్‌, శ్రియ, సముద్రఖని, ఒలీవియా మోరీస్‌ కీలకపాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

Also Read: RRR Movie 4th Single: RRR నుంచి మరో సాంగ్ అప్డేట్.. 'రోర్ ఆఫ్ భీమ్' రిలీజ్ ఎప్పుడంటే?

Also Read: Shyam Singha Roy Tara Song: 'శ్యామ్ సింగరాయ్' చిత్రం నుంచి 'తారా' సాంగ్ వచ్చేసింది! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News