Tirumala: తిరుమలలో షాకింగ్ ఘటన.. అలిపిరి వద్ద పాముకాటుకు గురైన భక్తుడు..అసలేం జరిగిందంటే..?
Snake bite: తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఒక భక్తుడు మెట్లమార్గం గుండా వస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలిపిరి వద్దకు చేరుకున్నాడు. అక్కడ కూర్చుని ఉండగా పాము కాటు వేసింది. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
snake bites to devotee near alipiri Tirumala: కొన్నిరోజులుగా తిరుమల మెట్ల మార్గంలో క్రూర జంతువుల సంచారం ఎక్కువైంది. ఇప్పటికే చిరుత పులులు, ఎలుగు బంట్లు తరచుగా అడవుల నుంచి బైటకు వస్తున్నాయి. మెట్ల మార్గంలో స్వామి వారిదర్శనం కోసం వెళ్లే భక్తులపై దాడులు సైతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరుత పులులు అడవిలో నుంచి ఒక్కసారిగా భక్తులపై దాడిచేసిన ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. చిన్నపిల్లలపై అమాంతం దాడిచేసి, వారిని అడవిలోకి లాక్కెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల తిరుమలలో భక్తులు మెట్ల మార్గంలో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత పులుల్ని బంధించడానికి అధికారులు సైతం ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు సైతం చేపట్టారు.
ఇదిలా ఉండగా.. రాత్రి పూట క్రూర జంతువులు మెట్ల మార్గంలోకి వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా అడవిలో వాటికి ఆహారం సరిగ్గా దొరక్కపోవడంతో బైటకు వస్తున్నట్లు తెలుస్తోంది. భక్తులు కొందరు ఫుడ్ ఐటమ్స్, స్నాక్స్ లను మెట్ల మార్గం వద్ద పడేస్తుంటారు. దీంతో ఇవి తినడానికి క్రూర జంతువులు అడవి నుంచి బైటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు పాములు సైతం.. మెట్ల మార్గం, తిరుమలలో ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో మెట్టమార్గంలో తిరుమల వెళ్తున్న భక్తుడు అలిపి వద్ద పాము కాటుకు గురయ్యాడు.
పూర్తి వివరాలు..
ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన చీరాలకు చెందిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. నాగేంద్ర, తన అన్నతో కలసి తిరుమలకు కాలినడకన వెళ్తున్నారు. అలిపిరి వద్దకు చేరుకొగానే కాళ్లు నొప్పి పెడుతుండటంతో నాగేంద్ర అక్కడే కూర్చున్నాడు. ఇంతలో అనుకోని ఘటన చోటు చేసుకుంది. నాగేంద్ర కాలిపై.. ఒక పాములు కాటేసింది. అతను పామును గమనించలేదని తెలుస్తోంది. ఏదో కుట్టినట్లు అన్పించి చూడగానే.. పెద్ద పాము అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో ఒక్కసారిగా షాక్ కు గురై తన అన్నకు, అక్కడున్న వారికి విషయం చెప్పాడు. వెంటనే అక్కడున్న వారంతా ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ సిబ్బంది అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు.
యువకుడిని హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సదరు యువకుడికి వైద్యం చేశారు. కాటు వేసిన పాము.. విషపూరితమైందని కాదని తెలుస్తోంది. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ప్రస్తుతం వైద్యులు యువకుడిని మరిన్ని టెస్టులు చేస్తున్నారు. కాగా, తిరుమల స్వామి వారి దర్శనం కోసం వెళ్తే.. ఇలా జరిగిందని కూడా భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Read more: Snake vs Mongoose: ముంగీసను పాముకాటేసిన విషం ఎక్కదు.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం తెలుసా..?
ఇటీవల ఒక యువతి తిరుమలలోని జాపాలీ హనుమాన్ ఆలయంకు వెళ్లింది. అప్పుడు భారీ చెట్లు కొమ్మ వచ్చి ఆమె మీద పడింది. దీంతో ఆమె కుప్పకూలీ కింద పడింది. ఆమె ప్రాణాలకు ఏంకాకున్న.. వెన్నుపూస మాత్రం దెబ్బతింది. ఇప్పుడు ఒక భక్తుడు పాము కాటుకు గురయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి