Sankranti Special Trains 2024: సంక్రాంతి అంటే మొత్తం రద్దీ అంతా తెలుగు రాష్ట్రాల్లోనే కన్పిస్తుంది. ముఖ్యంగా ఏపీలో సంక్రాంతి సందడి చాలా ఎక్కువ. సంక్రాంతి పురస్కరించుకుని దక్షిణ మధ్య రైల్వే మొత్తం 32 ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.  జనవరి 7, జనవరి 14 తేదీల్లో నెంబర్ 07089 సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్
2. జనవరి 8, 15 తేదీల్లో నెంబర్ 07090 బ్రహ్మపూర్ నుంచి వికారాబాద్ 
3. జనవరి 9, 16 తేదీల్లో నెంబర్ 07091 వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్ 
4. జనవరి 10, 17 తేదీల్లో నెంబర్ 07092 బ్రహ్మపూర్ నుంచి సికింద్రాబాద్  
5.  జనవరి 10, 17, 24 తేదీల్లో నెంబర్ 08541 విశాఖపట్నం నుంచి కర్నూలు
6. జనవరి 11, 18, 25 తేదీల్లో నెంబర్08542 కర్నూలు నుంచి విశాఖపట్నం 
7. జనవరి 12, 19, 26 తేదీల్లో నెంబర్ 08547 శ్రీకాకుళం నుంచి వికారాబాద్ 
8. జనవరి 13, 20, 27 తేదీల్లో నెంబర్ 08548 వికారాబాద్ నుంచి శ్రీకాకుళం 
9.  జనవరి 10, 17 తేదీల్లో నెంబర్ 02764 సికింద్రాబాద్ నుంచి తిరుపతి
10. జనవరి 1, 18 తేదీల్లో నెంబర్ 02763 తిరుపతి నుంచి సికింద్రాబాద్ 
11. జనవరి 12న నెంబర్ 07271 సికింద్రాబాద్-కాకినాడ
12. జనవరి 13న నెంబర్ 07272 కాకినాడ నుంచి సికింద్రాబాద్
13. జనవరి 8, 15 తేదీల్లో నెంబర్ 07093 సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్
14. జనవరి 9,16 తేదీల్లో నెంబర్ 07094 బ్రహ్మపూర్ నుంచి సికింద్రాబాద్
15. జనవరి 10వ తేదీన నెంబర్ 07251 నర్శాపూర్-సికింద్రాబాద్
16. జనవరి 11వ తేదీన నెంబర్ 07252 సికింద్రాబాద్ నుంచి నర్శాపూర్


వీటిలో రైలు నెంబర్ 07271 సికింద్రాబాద్ నుంచి కాకినాడ, నెంబర్ 07272 కాకినాడ నుంచి సికింద్రాబాద్ రైళ్లు జనగాం, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా వెళ్తాయి. 


అదే విదంగా రైలు నెంబర్ 07251 నర్శాపూర్-సికింద్రాబాద్, నెంబర్ 07252 సికింద్రాబాద్-నర్శాపూర్ రైల్లు కూడా జనగాం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్ల మీదుగా వెళ్తాయి. మిగిలిన రైళ్లు మాత్రం యధావిధిగా మెయిన్ లైన్ నుంచే రాకపోకలు సాగిస్తాయి.


Also read: Ysrcp Strategy: కాపు ఓట్లపై దృష్టి సారించిన వైసీపీ, వంగవీటి, ముద్రగడ కోసం ప్రయత్నాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook