రాయలసీమలో 'కొరియా సిటీ' అభివృద్ధి కానుంది. ఈమేరకు ఆ దేశ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ కొరియా కాన్సుల్ జనరల్ కిమ్ హంగ్ టే 37 కొరియా సంస్థలు వస్తున్న విషయాన్ని బాబు దృష్టికి తీసుకొచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సంస్థలన్నీ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని కొరియా సంస్థలు రావడంతో అనంతపురం జిల్లాలో 'కొరియా సిటీ' అభివృద్ధి కానుంది. అందుకోసం 4 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతున్నారు. సుమారు 7 వేల మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు రాబోతున్నట్లు చెప్పారు. ఇప్పటికే అక్కడ కియా మోటార్స్, దాని అనుబంధ సంస్థలు పెట్టుబడులు పెట్టిన సంగతి విదితమే. అక్కడ మరిన్ని కొరియా సంస్థలు స్థాపించి 'కొరియన్ సిటీ' అభివృద్ధి చేయనున్నామని సీఎంకు తెలిపారు. ఏపీతో కేవలం ఆర్థిక సంబంధాలే కాక సాంస్కృతిక, సామాజిక బంధాలను కూడా బలోపేతం చేసుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొరియా భాష నేర్పే కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబును కొరియా కోరింది. ఈ భేటీలో కొరియా బృందం ముఖ్యమంత్రి చంద్రబాబును దక్షిణ కొరియాలో పర్యటించాలని విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు.