AP Weather Update: ఏపీలో రుతు పవనాలు.. రానున్న మూడ్రోజులు మోస్తరు వర్షాలు
Andhra Pradesh Weather Update: తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న ప్రజానీకం రుతుపవనాల రాకతో ఊరట చెందినా..ఫలితం మాత్రం ఇంకా కన్పించడం లేదు. వర్షం జాడ లేక అల్లాడుతున్న ప్రజలకు ఈసారి ఐఎండీ నుంచి శుభవార్తే విన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
AP Weather Update: నైరుతి రుతు పవనాల రాక ఈసారి దేశంలో చాలా ఆలస్యంగా ప్రవేశించాయి. గతంలో ఎన్నడూ లేనంత ఆలస్యంగా జూన్ 8వ తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు ఏపీలో మరింత ఆలస్యంగా జూన్ 12వ తేదీన ప్రవేశించాయి. కానీ రుతు పవనాల ప్రయోజనం మాత్రం కన్పించడం లేదు. ఎక్కడా వర్షం జాడే లేదు.
ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి అందుతున్న తాజా అప్‌డేట్ మరోసారి ప్రజల్లో ఆశలు చిగురింపచేస్తోంది. రానున్న 3-4 రోజుల్లో రుతుపవనాల ప్రభావంతో తేలికపాటి వర్షాలు పడనున్నాయని..ఆ తరువాత అంటే జూన్ 18 నుంచి 21 తేదీల మధ్యలో దక్షిణ భారతదేశం, తూర్పు ప్రాంతంలో సైతం రుతుపవనాలు విస్తరించనున్నాయి. రేపట్నించి మూడ్రోజుల పాటు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకట్రెండు చోట్లు మోస్తరు వర్షాలు పడవచ్చు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు.
తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడి జల్లులు ఒకట్రెండు చోట్లు కురిసే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు ఇంకా వీయవచ్చు. ఇంకొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇక జూన్ 16 శుక్రవారం నాడు మోస్తరు వర్షాలు లేదా తేలికపాటి వర్షాలు పడవచ్చు. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్రలోనూ, దక్షిణ కోస్తాంధ్రలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.
Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?
అదే విధంగా రుతు పవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడవచ్చు. కొన్ని చోట్లు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అదే విధంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చు. ఇక జూన్ 14 గురువారం సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చు. అయితే ఈ వర్షాలు పూర్తిగా కాకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చు. ఇక శుక్రవారం జూన్ 16న సైతం ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా. మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చు.
ఇక రాయలసీమలో కూడా రుతుపవనాల ప్రభావంతో ఇవాళ తేలికపాటి వర్షాలు ఒకట్రెండు చోట్ల కురవవచ్చు. బలమైన గాలుపులు వీచే అవకాశాలున్నాయి. వాతావరణం మాత్రం అసౌకర్యంగా ఉండవచ్చు. జూన్ 15 గురువారం నాడు సైతం రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చు. కొన్ని చోట్ల బలమైన ఈదురుగాలులు వీచే పరిస్థితి ఉంది. ఇక జూన్ 16వ తేదీ శుక్రవారం నాడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. బలమైన గాలులు వీయవచ్చు.
Also Read: AP Eamcet 2023 Results: ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook