AP EAPCET 2023 Results Released: ఏపీఈఏపీసెట్ 2023 ఫలితాలను విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విడుదల చేశారు. ఫలితాలను https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మొత్తం 3,37,500 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాల్లో ప్రవేశానికి మే 15 నుంచి మే 23 వరకు పరీక్షలు నిర్వహించారు. ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మే 15 నుంచి మే 19 వరకు.. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 22, 23 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పరీక్షకు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్లు రిలీజ్ చేశారు. మంగళవారం ఏపీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలవ్వగా.. తాజాగా ఎంసెట్ రిజల్ట్స్ కూడా వచ్చేయడంతో విద్యార్థులకు టెన్షన్ తీరిపోయింది.
AP EAMCET 2023 Results ఇలా చెక్ చేసుకోండి..
==> https://cets.apsche.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
==> హోమ్‌పేజీలో AP EAPCET 2023 Results ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Also Read: Earthquake In Delhi: భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు జనం పరుగులు
==> అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్‌తో లాగిన్ అవ్వాలి
==> మీ AP EAMCET 2023 ఫలితాలు స్క్రీన్‌పై ప్రత్యక్షం అవుతాయి.
==> భవిష్యత్ అవసరాల కోసం ఫలితాలను డౌన్లోడ్ చేసి ఉంచుకోండి.
ఇంజనీరింగ్ విభాగంలో 76.32 శాతం, అగ్రి కల్చర్, ఫార్మసీ విభాగంలో 89.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలతోపాటు ర్యాంక్ కార్డు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ర్యాంక్ కార్డు కోసం https://cets.apsche.ap.gov.in/EAPCET22/Eapcet/EAPCET_GetRankCard.aspx లింక్‌ను క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబరు, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ర్యాంక్ కార్డు పొందొచ్చు.
ఏపీఈఏపీసెట్ పరీక్షలో ఉత్తీర్ణతకు జనరల్, ఓబీసీ కేటగిరీ విద్యార్థులకు 45 మార్కులు కాగా.. ఓబీసీ నాన్ క్రిమీలేయర్ అయితే 40 మార్కులు, ఎస్సీలకు 35 మార్కులు, ఎస్టీలకు 35 మార్కులుగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఇంటర్లో 25 శాతం వెయిటేజీ యాడ్ చేసి ర్యాంక్‌లు కేటాయించారు.
Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్ జాయ్ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి