Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో పిడుగులు పడనున్నాయా..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వానలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఇలాంటి పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు, ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ, రేపు, ఎల్లుండి వానలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉందని..అదే సమయంలో పిడుగులు పడే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ ఇదే వాతావరణం ఉండనుంది.
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలపడుతున్నాయి. అదే సమయంలో ఉపరిత ద్రోణి కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also read:Minister KTR on PM Modi: పోరు గడ్డ నుంచి తిరుగుబాటు తప్పదు..మోదీ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్..!
Also read:CM Jagan on Opposition: మీ పాలనలో పిల్లల గురించి ఆలోచించారా..ప్రతిపక్షాలపై సీఎం జగన్ ధ్వజం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి