ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఓటర్ల కోసం ప్రత్యేక రైళ్లను వేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి ఏపీకి రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను వేసినట్టు ప్రకటన విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రోజు సాయంత్రం 6:20కి సికింద్రబాద్ నుంచి కాకినాడకు ప్రత్యేక రైలు. అలాగే రాత్రి 7:20కి సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు. అలాగే రాత్రి 9 గంటలకు లింగంపల్లి నుంచి కాకినాడ వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది


రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లంతా తమ గమ్య స్థానాలకు చేసుకోవాల్సింది. కొందరు ఇప్పటికే తమ గమ్యస్థానాలకు చేరుకోగా..రద్దీ కారణంగా హైద్రాబాద్ లోనే ఉండిపోయారు. ఇలాంటి వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి ఊరట నిచ్చింది