Srikalahasthi Shiva Temple: కళ్లు తెరిచిన శివ లింగం... వేల సంఖ్యలో గుడికి క్యూ కట్టిన భక్తులు
Srikalahasthi Shiva Temple: శ్రీకాళహస్తి ఈటిసి కేంద్రంలో ఉన్న పురాతన శివాలయంలో ఉన్న శివలింగం కళ్ళు తెరిచిందని పూజారి చెప్పడంతో శివయ్య దర్శనానికి భక్తులు పోటెత్తారు. శివయ్య కళ్ళు తెరిచారన్న వార్త దావానంలా వ్యాపించడంతో భక్తులు తండోప తండాలుగా దర్శించుకుంటున్నారు. భక్తుల విశ్వాసాల నమ్మకానికి ఈ ప్రాంతానికి శివయ్య మేలు చేకూర్చాలని శ్రీకాళహ దేవస్థానం చైర్మన్ అంజూరు తారకు శ్రీనివాసులు అన్నారు.
Srikalahasthi Shiva Temple: త్రినేత్రుడే నేత్రం తెరిచాడు అన్న సమాచారంతో మహాదేవుని దర్శించడానికి భక్తులు కండోపతండాలుగా తరలివచ్చి పరమేశ్వరుడును దర్శించుకుంటూ శంభో శంకర అంటూ స్వామి నామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తున్నారు. శ్రీకాళహస్తిలోని ఈటిసి కేంద్రంలో నాటి కాళహస్తి రాజులచే నిర్మించిన శివాలయం ఉంది. ఇక్కడ శివుడే స్వయంగా వెలిసినట్టుగా స్థల పురాణం చెబుతుంది. ఈ మందిరాన్ని అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాధ్ ఆలయంగా పిలుస్తారు. ఈ శివాలయాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న గంగయ్య ఈ ఉదయం అభిషేక పూజలు చేసి అలంకారం చేసిన తర్వాత స్వామి వారు కళ్ళు తెరిచినట్లు గమనించారు. తదుపరి మధ్యాహ్నం స్థానికులతో కలిసి వచ్చి శివలింగాన్ని పరిశీలన చేయగా, స్వామి వారు కళ్ళు తెరిచినట్లు కనపడటంతో ఆ వార్త పట్టణమంతా క్షణాల్లో వ్యాపించింది. దీంతో సర్వేశ్వరుని దర్శించడానికి స్థానికులు పెద్ద ఎత్తున శివాలయానికి తరలివచ్చారు. స్థానిక మాజీ కౌన్సిలర్ సుమతి, వైసీపీ నాయకులు కుమార్ ఆధ్వర్యంలో స్థానికులను నియంత్రిస్తూ స్వామివారి దర్శనం కల్పించారు.
భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పడుతుండడంతో సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు వచ్చి భక్తులను నియంత్రిస్తూ భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయానికి వచ్చి పూజలు జరుపుతూ పెద్ద ఎత్తున పిండి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది కూడా చదవండి : Vaishno Devi Temple Trip: ఈ ఒక్క గుడికి వెళ్తే.. మరో 10 పర్యాటక ప్రదేశాలు చూడొచ్చు
సమాచారం అందుకున్న శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూ రు తారక శ్రీనివాసులు శివాలయానికి వచ్చి శివయ్యను దర్శించుకున్నారు. దేవస్థానం చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు మాట్లాడుతూ స్వామి వారు కళ్ళు తెరిచిన విధంగా ఉండడం భక్తులు స్వామి వారి కళ్ళు తెరిచిన్నట్లు పెద్ద ఎత్తున పూజలు జరుపుతున్నారని పరమేశ్వరుడు ఈ ప్రాంతానికి మేలు చేయాలని ఈ ప్రాంతం సస్య శ్యామలంగా ఉండాలని ఆకాంక్షించారు.. స్థానిక పూజారి గంగయ్య స్థానికులు కుమార్ మాట్లాడుతూ స్వామి వారు కళ్ళు తెరిచి భక్తులను ఆశీర్వదిస్తున్నారంటూ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి : King Cobra snake Caught in paddy Fields: భారీ వర్షాలతో పంట పొలాల్లోకి పెద్ద నాగు పాము
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి