Srikalahasti issue: మొన్న అంతర్వేది.. తాజాగా శ్రీకాళహస్తి..
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ( Antarvedi radham fire issue ) ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళనకు దిగి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ సర్కార్ సైతం ఈ కేసు విచారణలో పారదర్శకతను నిరూపించుకునేందుకు ఈ కేసు విచారణను సీబీఐకి ( CBI investigation ) బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
చిత్తూరు : అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ( Antarvedi radham fire issue ) ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళనకు దిగి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ సర్కార్ సైతం ఈ కేసు విచారణలో పారదర్శకతను నిరూపించుకునేందుకు ఈ కేసు విచారణను సీబీఐకి ( CBI investigation ) బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అంతర్వేదీ ఘటన మరువకముందే తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ( Srikalahasti temple ) మరో అపచారం చోటుచేసుకుంది. ఆలయంలో కాశీ లింగం, రామేశ్వరం లింగం పక్కనే లింగం, నంది ప్రతిష్ఠాపన చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే అప్రమత్తమై శివ లింగం, నంది ప్రతిమలను అక్కడి నుంచి తొలగించి వేద పండితుల చేత సంప్రోక్షణ చేయించారు. శ్రీకాళహస్తిలో కలకలం రేపిన ఈ ఘటనపై ఆలయ పండితులు గురుకుల్ స్వామినాధన్ స్పందిస్తూ.. అపచారం జరిగిందని అభిప్రాయపడ్డారు. Also read : Antarvedi chariot fire case: అంతర్వేది రథం దగ్ధం కేసులో ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
అంతర్వేదీ ఘటనపై ( Antarvedi issue ) ఏపీ సర్కార్ సీబీఐ విచారణకు సిద్ధపడటంతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త సద్దుమణుగుతున్నాయని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ ఇలా శ్రీకాళహస్తిలో ఈ ఘటన వెలుగుచూడటంపై మరోసారి రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. శ్రీకాళహస్తిలోని గాలిగోపురం వద్ద ఆందోళన చేపట్టిన టీడీపీ నేతలు ( TDP leaders ), కార్యకర్తలు హిందూవుల మనోభావాలను కాపాడాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందువుల దేవాలయాల్లో అన్యమత ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా మరోసారి టీడీపీ నేతలు నిరసన వ్యక్తంచేశారు. వరుస ఘటనలపై హిందూ సంఘాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. Also read : COVID-19 in AP: ఏపీలో కొత్తగా 9,999 కరోనా కేసులు