ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. పుకార్లతో జనాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ఏం చేస్తుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


అంతర్వేది ఆలయం ( Antarvedi Temple ) లో రధం దగ్దమైన ఘటన నుంచి రామతీర్ధం ఘటన ( Ramatheertham incident ) వరకూ ఆలయాల్లో జరుగుతున్న దాడుల నేపధ్యంలో ప్రభుత్వం ( Ap Government ) సీరియస్‌గా తీసుకుంది. వివిధ రకాల చర్యలతో పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 57 వేల 493 మతపరమైన సంస్థలు, ఆలయాలను గుర్తించి వాటికి జియో ట్యాగింగ్‌ ( Geo Tagging ) చేసి మ్యాపింగ్‌ చేశారు. ఇప్పటివరకు ఆలయాల్లో జరిగిన విద్రోహ ఘటనలకు సంబంధించి మొత్తం 236 మంది అరెస్టయ్యారు. దేవాలయాల్లో నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 11 వందల 96 మందిని బైండోవర్‌ చేయడంతోపాటు హిస్టరీ షీట్లు తెరిచి వారి కదిలికలపై నిఘా ఉంచారు. 


రాష్ట్రంలోని అన్ని ఆలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అగ్నిమాపక జాగ్రత్తలు చేపట్టారు. 37 వేల 673 సీసీ కెమేరాల్ని ఏర్పాటు చేశారు. 11 వేల 295 ప్రదేశాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటయ్యాయి. వాస్తవాల్ని నిర్ధారించుకోకుండా మతాల్ని రెచ్చగొట్టి..వివాదాలు సృష్టించి ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Ap Dgp Gautam Sawang ) సూచించారు. రాష్ట్రంలోని ఏ ప్రార్ధనా మందిరంలోనైనా చిన్న సంఘటన జరిగినా బాధ్యుల్ని గుర్తిస్తున్నామన్నారు. మతపరమైన అంశాల్ని వివాదం చేసిన ప్రజల్ని రెచ్చగొడుతూ శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే..కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు.


Also read: AP: ఆలయ ఘటనల వెనుక కుట్రకోణం ఉందా..అసలేం జరుగుతోంది..వాస్తవమేంటి