మారు వేషంలో దోపిడీ దారుల పనిపట్టిన సబ్‌కలెక్టర్ ప్రవీణ్ చంద్..
Kaikaluru: లుంగీ, చొక్కా ధరించి మారువేషంలో ఎరువుల దుకాణాలకు వెళ్లారు కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్. ఆయన ఆకస్మిక తనిఖీ చేయటంతో దుకాణదారుల మోసాలు బయటపడ్డాయి. రెండు షాపులను సీజ్ చేశారు.
Sub-collector Surya Sai Praveen Chand went to inspect the farmer getup: ఓ వ్యక్తి లుంగీ, చొక్కా ధరించి బైక్ పై ఎరువుల దుకాణానికి (Fertilizer shop)వచ్చాడు. ఆ షాపు యజమానిని ఎరువులు కావాలని అడిగాడు. అడిగిన ఎరువులు ఇచ్చాడు ఆ దుకాణదారుడు. అయితే ఎంఆర్‌పీ ధర కన్నా అధికంగా ఎందుకు వసూలు చేస్తున్నారని షాపు యజమానిని గట్టిగా నిలదీశాడు అతడు. అప్పడుగానీ అర్థం కాలేదు...ఎరువులు కోసం వచ్చింది రైతు కాదు..విజయవాడ సబ్ కలెక్టరు సూర్యసాయి ప్రవీణ్ చంద్ (Vijayawada Sub Collector Suryasai Praveen Chand) అని.
వివరాల్లోకి వెళితే....
Also Read: పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రంలో కీలక పనులు ప్రారంభం
విజయవాడ సబ్ కలెక్టర్ సూర్యసాయి ప్రవీణ్ చంద్ (Vijayawada Sub Collector Suryasai Praveen Chand)సాధారణ రైతు అవతారంలో కృష్ణా జిల్లా(Krishn District) కైకలూరు(Kaikaluru)లోని ఎరువుల దుకాణాలకు వెళ్లారు. అక్కడ ఓ షాపు యజమానిని ఎరువులు కావాలని అడగ్గా...స్టాక్ ఉన్నా లేవని చెప్పాడు. దీంతో ఆయన మరో షాపుకు వెళ్లి,..ఎరువులు అడిగారు. సబ్‌కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చాడు ఆ షాపు యజమాని. అయితే, ఈ షాపు యజమాని ఎంఆర్‌పీ ధర కన్నా ఎక్కువ వసూలు చేశాడు. పైగా బిల్లు కూడా ఇవ్వలేదు. దీంతో ఆగ్రహించిన సబ్ కలెక్టర్.. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి షాపు వద్దకు పిలిపించారు.
స్టాక్ ఉన్నా లేదని చెప్పిన దుకాణాన్ని, అధిక ధర వసూలు చేసిన షాపును సీజ్ చేయించారు. అక్కడి నుంచి అధికారులతో కలిసి ముదినేపల్లిలో ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు. అయితే, ముదినేపల్లిలో సబ్ కలెక్టర్(Sub Collector) వెళ్లిన షాపు మూసివేసి ఉండటంతో.. అక్కడి రైతులను ధరలు అడిగి తెలుసుకున్నారు. ఎంఆర్‌పీ కన్నా అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని సబ్ కలెక్టర్‌కి రైతులు తెలిపారు. షాపు యజమానిని పిలిపించి..ఆ దుకాణంపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Also Read: Covid -19 Updates: కేసులు తగ్గిన, పెరుగుతున్న కరోనా మరణాలు...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook