Si Sucide In Ap: ఏపీలో ఓ సబ్‌ ఇన్‌ స్పెక్టర్‌ సూసైడ్‌ చేసుకోవడం సంచలనం సృష్టించింది.  కాకినాడ రూరల్‌ పరిధిలోని సర్పవరం పోలీస్‌ స్టేషన్‌ లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న గోపాల కృష్ణ సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకున్నాడు. గోపాలకృష్ణ నిన్న సీఎం బందోబస్తు  డ్యూటీలోనూ పాల్గొన్నాడు. విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన గోపాలకృష్ణ  తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో గన్‌ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక గదిలో పిల్లలు, భార్య నిద్రిస్తుండగా.. హాల్‌ లో గన్‌ తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. గోపాలకృష్ణ స్వగ్రామం విజయవాడ దగ్గర్లోని జగ్గయ్యచెరువు. మృతునికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకోవడంపై స్థానికంగా కలకలం రేపింది.  మృతుని భార్య పావని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా లేక.. మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఘటనస్థలాన్ని పరిశీలించారు.
గోపాలకృష్ణ  2014 బ్యాచ్‌ కు చెందిన సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి, సర్పవరం, రాజోల్‌, కాకినాడ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లలో పనిచేశాడు. ఆగస్టు 2021 నుంచి సర్పవరం పీఎస్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు.


అయితే ఎస్‌ఐ మృతిపై అవాస్తవాలు ప్రచారం చేయడంపై పోలీసు ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైకి పోస్టింగ్ ఇవ్వకుండా వేధించారని, అధికారుల వేధింపుల వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని తప్పుడు వార్తలను ప్రసారం చేయడంపై కాకినాడ SDPO భీమారావు ఘాటుగా స్పందించారు. అవాస్తవాలు ప్రచారం చేసి పోలీస్‌ శాఖ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఎంసీఏ పూర్తిచేసిన తర్వాత గోపాలకృష్ణ సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం చేసేవాడని చెప్పారు. ఎస్‌ఐ ఉద్యోగానికి సెలెక్ట్‌ కావడంతో సాఫ్ట్‌ వేర్‌ జాబ్‌ ను వదులుకున్నాడని భీమారావు తెలిపారు. అయితే మొదటి నుంచి కూడా గోపాలకృష్ణ అనవసరంగా సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగం వదులకున్నానంటూ బాధపడేవాడని అతని సహచరులు చెబుతున్నారని SDPO భీమారావు చెప్పారు.


మొత్తంగా యువ ఎస్‌ఐ  సర్వీస్‌ రివాల్వర్‌ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. మరి ఇందుకుగల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు పోలీసులు. ఉన్నతాధికారుల వేధింపులా లేక.. ఇతరఏమైనా కారణాలు ఉన్నాయా అనేది విచారణలో తేలనుంది.


Also Read: Pat Cummins IPL: ఐపీఎల్‌ నుంచి కోల్‌కతా పేసర్ పాట్‌ కమిన్స్‌ ఔట్.. కారణం ఇదే!


Also Read: Karate Kalyani Vs Srikanth Reddy: ముదురుతోన్న వివాదం... కరాటే కల్యాణితో ప్రాణ హాని ఉందన్న ప్రాంక్‌స్టర్ శ్రీకాంత్ రెడ్డి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook