Suneetha Narreddy Meets Chandrababu: తన తండ్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె సునీతా నర్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి హత్య జరిగి ఐదేళ్లు దాటినా ఇంకా న్యాయం జరగకపోవడంతో ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలవడం కలకలం రేపింది. తన తండ్రిని హత్య చేసిన హంతకులకు శిక్షపడేలా చేయాలని ఆమె చంద్రబాబును కోరినట్లు సమాచారం. కాగా రాజకీయంగా తన సోదరుడు, మాజీ సీఎం జగన్‌కు బద్ద శత్రువైన చంద్రబాబును సునీత కలవడం తీవ్ర సంచలనం రేపింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan: రూ.కోటితో రంగంలోకి మాజీ సీఎం జగన్‌.. వైసీపీ నాయకుల నెల జీతంతో


 


అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబును సునీతా రెడ్డి మంగళవారం కలిశారు. తన భర్తతో కలిసి సీఎంతో సమావేశమయ్యారు. వివేకా వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు నాటి సీబీఐ ఎస్పీ రాంసింగ్‌తోపాటు తమపై అక్రమ కేసు పెట్టారని సీఎం బాబుకు సునీత వివరించారు. కృష్ణారెడ్డి ఫిర్యాదులో నిజనిజాలపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. రాంసింగ్‌పై కేసు వంటి అంశాలపై విచారణ చేయించాలని కోరారు.

Also Read: YS Jagan vs Lokesh: మంత్రి నారా లోకేశ్‌ స్టైలే వేరు.. మాజీ సీఎం జగన్‌ను కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా పరిగణన


 


సీఐడీ విచారణ ద్వారా వాస్తవాలు బయటకు రావాలని సీఎం చంద్రబాబుకు వివేకా కుమార్తె సునీత సూచించారు. సునీత దంపతులు చెప్పిన విషయాలు ఆసక్తిగా విన్న సీఎం వారి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. అయితే తనకు అన్ని విషయాలు తెలుసని.. విచారణ చేయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం. సీఎం చంద్రబాబును సునీత కలవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


న్యాయస్థానంలో అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్ వివేకానందా రెడ్డి కుమార్తె నర్రా సునీతా రెడ్డి తన తండ్రి హత్యకు న్యాయం జరిగే వరకు విశ్రమించేటట్టు లేరు. ఐదేళ్ల వరకు తన తండ్రి హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ సహాయం కోరుతున్నారు. ఈ క్రమంలోనే నెల కిందట ఏపీ హోం మంత్ వంగలపూడి అనితతో భేటీ అయిన విషయం తెలిసిందే. వివేకా హత్య అనంతరం జరిగిన పరిణామాలన్నీ కూటమి ప్రభుత్వానికి సునీత వివరించే ప్రయత్నం చేస్తున్నారు.


వివేకా హత్య పరిణామాలు
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందా రెడ్డి 15 మార్చి 2019లో దారుణ హత్యకు గురయ్యారు. నాటి ఈ హత్య కేసు అపరిష్కృతంగానే ఉంది. సీబీఐ, తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ప్రధాన హస్తం ఉందని సునీత ఆరోపణలు చేస్తున్నారు. అతడిని అరెస్ట్‌ చేయాలని సునీత బహిరంగంగా డిమాండ్‌ చేస్తోంది. హైకోర్టు, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగ.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ పరిధిలో ఉంది. ఆ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసు విషయమై తన సోదరి వైఎస్‌ షర్మిలతో కలిసి సునీత పోరాటం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో ఆ పార్టీలో సునీత తిరిగారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన అవినాశ్‌కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో సునీత ప్రచారం చేశారు. గతంలో హోంమంత్రి.. తాజాగా ముఖ్యమంత్రిని కలవడంతో వివేకా హత్య కేసులో ఏదైనా పురోగతి లభిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook