Chandrababu Case Updates: క్వాష్ పిటీషన్‌పై చంద్రబాబుకు ఊరట, రేపు విచారించనున్న సుప్రీంకోర్టు
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై స్పష్టత వచ్చింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపేందుకు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్, రిమాండ్ రెండూ అక్రమమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబుకు కాస్త ఊరట లభించింది. పిటీషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ అంగీకరించి రేపటికి లిస్టింగ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటీషన్‌ను సుప్రీంకోర్టులో దాఖలు చేయగా విచారించేందుకు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. రేపు అంటే బుధవారానికి లిస్టింగ్ చేశారు. అయితే ఏ బెంచ్ ముందుకు విచారణకు వస్తుందో సాయంత్రానికి గానీ వెల్లడి కాదు.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 2 వరకూ సుప్రీంకోర్టుకు సెలవులున్నాయి. దాంతో రేపటికి లిస్టింగ్ అయిన క్వాష్ పిటీషన్‌పై విచారణ రేపు జరుగుతుందా లేక వచ్చేవారానికి వాయిదా పడుతుందా అనే వాదన కూడా విన్పిస్తోంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్టును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ముందు ఈ పిటీషన్ గురించి ప్రస్తావించారు. ఈ పిటీషన్ ఏపీకు చెందిందని, అక్కడ ప్రతిపక్షాలు అణచివేయబడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు ఎప్పట్నించి రిమాండ్‌లో ఉన్నారని సుప్రీంకోర్టు సీజేఐ ప్రశ్నించగా, ఈ నెల 9న అరెస్ట్ అయి 10 నుంచి రిమాండ్‌లో ఉన్నారని బదులిచ్చారు.
Also read: Chandrababu Case Updates: చంద్రబాబుకు బెయిల్ లభించేనా, మళ్లీ కస్టడీ పొడిగింపా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook