Chief Justice Nv Ramana: భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన దిగ్విజయంగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని జస్టిస్ ఎన్‌వి రమణ ఆకాంక్షించారు. తేనీటి విందు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్‌గా బాధ్యతల స్వీకరించిన తరువాత తొలిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు గ్రామస్థుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. జస్టిస్ ఎన్వీ రమణపై పూలవర్షం కురిపిస్తూ గ్రామస్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. వినూత్నంగా సాంప్రదాయ పద్థతిలో ఎడ్లబండిపై ఊరేగింపుతో, మేళ తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణ‌ను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగింపుకు ముందు నిలిచిన అలంకృత గుర్రాలు అందరిని కనువిందు చేశాయి. దారి పొడుగునా పాఠశాల విద్యార్ధినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు (Tea Party) ఇచ్చింది.


ఈ సందర్భంగా జస్టిస్ ఎన్‌వి రమణ (Chief Justice NV Ramana)మాట్లాడారు. ఏపీ మరింతగా అభివృద్ధి చెందాలని..రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అందించారు. ప్రతి ఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో , ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. తెలుగువాడిగా ఇక్కడికి పిలిచి..గౌరవించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవసూచకంగా తేనీటి విందు ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ఛీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1965 తరువాత తెలుగు వ్యక్తి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కావడం గర్వకారణమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కృష్ణా జిల్లాలోని మారుమూల చిన్న గ్రామం నుంచి ఓ వ్యక్తి సీజేఐ స్థాయికి ఎదగడం మంచి పరిణామమన్నారు. అటు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ..తేనీటి విందు ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (Ap cm ys jagan) ధన్యవాదాలు తెలిపారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తన సతీమణి వైఎస్ భారతితో కలిసి సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ వచ్చేవరకూ బయటే వేచి చూసి..సాదర స్వాగతం పలికారు. అనంతరం ఏపీ, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులకు పుష్పగుఛ్ఛాలిచ్చి స్వాగతించారు. ఆ తరువాత రాష్ట్ర మంత్రుల్ని పరిచయం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ముఖ్యమంత్రి జగన్, ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణలు సంయక్తంగా అభివాదం చేశారు. 


Also read: Chief Justice NV Ramana: ఏపీ ప్రభుత్వం తేనీటి విందుకు హాజరైన జస్టిస్ ఎన్ వి రమణ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి