AP Capital Issue: ఏపీకు మూడు రాజధానులా, అమరావతి ఏకైక రాజధానా తేలేందుకు మరి కొంత సమయం వేచిచూడాల్సిందే. మరో నాలుగు నెలలకు ఈ విషయంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. జూలై 11న తుది విచారణకు సుప్రీంకోర్టు తేదీ నిర్ణయించింది. జూలై కంటే ముందు సుదీర్ఘ విచారణ సాధ్యం కాదని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీ రాజధాని అంశంపై నిన్న అంటే మార్చ్ 28న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం ఈ కేసుని విచారిస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటీషన్లతో కలిపి కేసు విచారణ ప్రారంభమైంది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ తేదీ ఖరారు చేయాలని, ఏప్రిల్ 11 జాబితాలో చేర్చాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఏప్రిల్ 11న ఇప్పటికే 13 అంశాలున్నందున జూలై 11 జాబితాలో చేరుస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. 


విచారణకు ఎంత సమయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించడంతో..ప్రతివాదులు దాదాపు 250 మంది ఉన్నారని న్యాయవాది ఒకరు సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న చట్టాలపై హైకోర్టు తీర్పు ఇచ్చిందని..అలాగని పూర్తి స్థాయి స్టే ఎక్కడా విధించలేదని, అసలీ అంశం కోర్టు పరిధిలోది కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది కే వేణుగోపాల్ తెలిపారు. వాదనలకు ఓ గంట సమయం సరిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతులు కట్టేయడంతో అభివృద్ధి ముందుకు సాగడం లేదన్నారు. అందుకే ఈ అంశంపై త్వరగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశమైనందున త్వరగా విచారణ ముగించాలని కోరారు.


Also read: AP 10th Exams: పదవ తరగతి పరీక్షకు అంతా సిద్ధం, ఏప్రిల్ నెలాఖరులోనే ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook