Ap Capitals issue: సుప్రీంలో జగన్ సర్కార్కు షాక్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది.
Supreme Court on AP three capitals issue: ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కో ఉత్తర్వులను రద్దుచేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం ( Supreme Court ) బుధవారం కొట్టివేసింది. మూడు రాజధానుల విషయం ( three capitals issue ) పై ఏపీ హైకోర్టు విచారణ చేస్తున్నందున దీనిపై జోక్యం చేసుకోలేమని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులో రేపే విచారణ ఉన్నందున తమ వద్దకు రావడం సరికాదని, ప్రభుత్వ వాదనలను అక్కడే వినిపించాలని సుప్రీం స్పష్టంచేసింది. Also read: AP: కరోనా బారిన తిరుపతి ఎమ్మెల్యే
ఈ క్రమంలో పరిపాలన రాజధానిని విశాఖపట్నానికి మార్చడానికి అనుమతివ్వాలని ఏపీ తరపు న్యాయవాది రాకేష్ ద్రివేది సుప్రీంకోర్టును కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం పలాన గడువులోపు విచారణ ముగించాలంటూ మేం ఆదేశించలేమని స్పష్టంచేసింది. Also raed: JEE-NEET Exams: ఆ తేదీల్లోనే పరీక్షలు.. గైడ్‌లైన్స్ విడుదల
Disha Patani: అందాలతో కనులవిందు చేస్తున్న దిశా పటానీ