AP: హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి నెలాఖరుకు వాయిదా వేసింది.
అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను జనవరి నెలాఖరుకు వాయిదా వేసింది.
అమరావతి భూముల కుంభకోణం ( Amaravati lands scam ) కేసులో జరుగుతున్న సీఐడీ దర్యాప్తుపై ఏపీ హైకోర్టు ( Ap High court ) ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ అప్పట్లో సంచలనమైంది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ ఆర్డర్‌ను తప్పబట్టింది. ఈ గ్యాగ్ ఆర్డర్ ( Gag order )ను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ( Ap Government ) దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ( Supreme court ) ఇవాళ విచారణ జరిపింది. హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్‌కు బ్రేక్ వేస్తూ స్టే విధించింది. కేసులో మాజీ అడ్వకేట్ జనరల్ సహా 13 మందికి నోటీసులు జారీ చేసింది. జనవరి నెలాఖరుకు విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు..అప్పటివరకూ కేసును ఫైనల్ చేయవద్దని సూచించింది.
ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ వాదన విన్పించారు. నేరం జరిగిన తరువాత దర్యాప్తు చేయవద్దా అని అడిగారు. విచారణ వద్దు..రిపోర్టింగ్ చేయవద్దంటారు..ఈ కేసులో అసలేమీ జరగకూడదా అని ప్రశ్నించారు. మాజీ అడ్వకేట్ జనరల్ కోర్టును ఆశ్రయిస్తే..మొత్తం 13మందికి ఆర్డర్స్ ఎలా వర్తింపజేస్తారని రాజీవ్ ధావన్ అడిగారు. కేసు వివరాలు ఎందుకు వెల్లడి కావద్దని..పిటీషనర్ అడగకుండానే ఇలాంటి ఆదేశాలు ఎలా ఇస్తారంటూ హైకోర్టు వ్యవహరించిన తీరును రాజీవ్ ధావన్ సుప్రీంకోర్టులో ప్రస్తావించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు హైకోర్టు గ్యాగ్ ఆర్డర్‌పై బ్రేక్ వేస్తూ స్టే విధించింది. Also read: Nivar Cyclone live updates: తీవ్రరూపం దాలుస్తున్న నివర్ సైక్లోన్