Supreme Court: ఆలయ వ్యవహారాలు సుప్రీంకోర్టు పరిధిలో రావు
Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి పూజల వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగింది.
Supreme Court: తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శ్రీవారి పూజల వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగింది.
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆలయ రోజువారీ వ్యవహారాలు రాజ్యాంగ న్యాయస్థానం పరిధిలోకి రావని ధర్మాసనం స్పష్టం చేసింది. శ్రీవారికి జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో అభ్యంతరాలుంటే టీటీడీ యజమాన్యం దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పింది. పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని టీటీడీకి సూచించింది. స్వామివారికి పూజా కైంకర్యాలపై టీటీడీకి చెప్పినా పట్టించుకోకపోతే సరైన ఫోరాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు(Supreme Court) స్పష్టం చేసింది. శ్రీవారి దాత లేవనెత్తిన అంశాలపై 8 వారాల్లోగా స్పందించాలని టీటీడీకి సూచించింది.
శ్రీవారి దాతల్లో ఒకరు ఆగమ శాస్త్రం(Aagama Sastram)ప్రకారం పూజలు జరగడం లేదంటూ ఈ పిటీషన్ దాఖలైంది.ఈ పిటీషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పూజా కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని టీటీడీ గతంలోనే అఫిడవిట్ దాఖలు చేసింది. అటు సుప్రీంకోర్టు కూడా పిటీషనర్ కేవలం ప్రచారం కోసమే ఇలా చేస్తున్నట్టుగా వ్యాఖ్యానించింది.
Also read: AP Three Capital Issue: కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకుంటారా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook