ఏపీ రాజధాని అమరావతినా లేదా మూడు రాజధానులా అనే విషయంపై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ జరగాల్సిన విచారణ జాబితాలో లేకపోవడంతో తిరిగి ఎప్పుడనేది ఆసక్తిగా మారింది. ఇవాళ్టి విచారణ ఎందుకు వాయిదా పడిందనేది స్పష్టత రావల్సి ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశంపై త్వరలో సుప్రీంకోర్టు నుంచి క్లియరెన్స్ వస్తుందని ఏపీ ప్రభుత్వం ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల కొద్దిరోజులుగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా మంత్రులు విశాఖ నుంచి పరిపాలన చేపట్టనున్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇన్వెస్టర్లతో జరిగిన వివిధ సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఈ అశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. 


ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు విచారణపై చాలా ఆశలు పెట్టుకుంది. అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలని ఫిబ్రవరి 6వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. దాంతో ఈ కేసు విచారణను ఫిబ్రవరి 23వ తేదీన అంటే ఇవాళ విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే నోటీసులిచ్చి కేసుల్ని బుధ, గురు వారాల్లో విచారించవద్దని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో ఇవాళ జరగాల్సిన అమరావతి విచారణ ఆగిపోయింది. మరోసారి వాయిదా పడింది కానీ తిరిగి విచారణ ఎప్పుడనేది ఇంకా స్పష్టత లభించలేదు. 


మార్చ్ నెలలో విశాఖలో జరగాల్సిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల్లో అవగాహన కోసం రోడ్ షో కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరులో జరిగిన కార్యక్రమాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు విశాఖే రాజధాని, త్వరలో అక్కడి నుంచి పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. బహుశా సుప్రీంకోర్టు విచారణ త్వరగా కొలిక్కి వస్తుందనే ఆశతో ఏపీ ప్రభుత్వం ఈ ప్రకటన చేసుంటుందని భావిస్తున్నారు. 


Also read: YS Viveka Murder Case: వైఎస్ వివేకాను చంపింది ఎవరో తేల్చేసిన సీబీఐ, రాష్ట్రంలో ఏం జరగబోతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook