ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో సీబీఐ తేల్చేసింది. ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయంటోంది.
ఏపీలో 2019లో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో పరిణామాలు పెను సంచలనం కల్గించనున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో వివరిస్తూ సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే చంపించారని..ఇందుకు సాక్ష్యాలున్నాయని సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఈ హత్యలో నేరుగా పాల్గొన్న యాదాటి సునీల్ యాదవ్ బెయిల్ పిటీషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ వేసిన పిటీషన్‌లో సంచలన విషయాలున్నాయి. విచారణలో భాగంగా తేలిన విషయాలను సీబీఐ పిటీషన్‌లో వివరించింది. హత్యకై 40 కోట్లతో డీల్ కుదిరిందని..సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని తెలిపింది.
సీబీఐ చెప్పిందిదే
వైఎస్ వివేకానందరెడ్డిని అడ్డు తొలగించేందుకు, ఎంపీ సీటుకు అడ్డొస్తున్నారని భావించడమే కారణమని సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకాను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో కలిసి అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్ర పన్నారని వివరించింది. ఆ ప్లాన్‌ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని తేలిందన్నారు. ఆ సమయంలో వివేకాను విభేదిస్తున్నవారంతా ఏకతాటిపై తీసుకొచ్చారన్నారు.
వివేకానందరెడ్డిపై ఆగ్రహంతో ఉన్న ఎర్ర గంగిరెడ్డి..సునీల్ యాదవ్, డ్రైవర్ దస్తగిరి, ఉమా శంకర్ రెడ్డిలను కూడగట్టి ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా చేశారని సీబీఐ వెల్లడించింది. సునీల్ యాదవ్ వజ్రాల పేరుతో విలువైన రాళ్ల వ్యాపారం చేస్తుంటే..వద్దని హెచ్చరించినందుకు వివేకాపై సునీల్ కోపం పెంచుకున్నట్టు సీబీఐ వివరించింది. వివేకానందరెడ్డి హత్య చేసిన రోజు నిందితులంతా వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు సీబీఐ తెలిపింది.
ఇటీవలే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. కాల్ డేటా ఆధారంగా కీలక ప్రశ్నలు సంధించింది. అవినాష్ రెడ్డి ఏ సమయంలో ఎవరెవరికి ఎంతసేపు మాట్లాడారో ఫోన్ నెంబర్లతో సహా సీబీఐ వెల్లడించింది. సీబీఐ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డిని నాలుగు గంటలసేపు విచారించారు. ఈ నెల 24వ తేదీన మరోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది.
Also read: Gannavaram Issue News: పనికిమాలిన వెధవలు, పైసాకు పనికిరాని వ్యక్తులు.. మంత్రి రోజా హాట్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook