Tadikonda MLA Undavalli Sridevi Sensational Comments on CM Jagan : సీఎం జగన్ దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయిందని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని.. అనారోగ్యంలోనూ సర్పంచ్, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి గామంలో తిరిగానని చెప్పారు. అలాంటి తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వివరణ తీసుకోకుండానే చర్యలు తీసుకున్నారని.. షాకుల మీద షాకులు ఇచ్చారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతానికి తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను అని.. ఏ పార్టీలోనూ చేరట్లేదని స్పష్టం చేశారు. తనను అవమానించిన వారికి త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినట్లు వైసీపీ అధిష్టానం భావించి.. సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె ఆదివారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'వైఎస్సార్ తనయుడు పార్టీ అంటే విలువలతో ఉంటాయనుకున్నా.. రాజకీయాల్లో ఎలాంటి విలువ లేని రాజకీయాలు ఉంటాయని నేను అనుకోలేదు. అమరావతి రైతుల కోసం ప్రాణం పోయేదాకా పోరాటం చేస్తా.. అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దాం నేను డబ్బులు తీసుకున్నానని నిరూపించండి. పిచ్చి కుక్కతో సమానంగా నన్ను చూశారు. ఈరోజు నుంచి నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను. 


మొన్నటివరకు నాతోపాటు ఉన్నవారే నా పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు. నియోజకవర్గ ప్రజలు కలిసి వస్తే నేను వారి సమస్యపై పోరాటం చేస్తాను. నాకు ప్రాణ హాని ఉంది నాకేం జరిగినా సజ్జల రామకృష్ణారెడ్డి  బాధ్యత వహిస్తాడు. నాపై కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడుతున్నారు‌. నేను దళిత ఎమ్మెల్యేను అందుకే పార్టీలో నాకు సరైన గుర్తింపు లేదు. అమరావతి రాజధాని ఉద్దండయ్యపాలెంలో ఇసుక మాఫియా ఎవరిది. దానికి నేను అడ్డం వస్తున్నాను అని ఈ విధంగా నన్ను పార్టీ నుంచి తప్పించారు..' అని ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు.


రాజధాని పరిధిలో ఎమ్మెల్యేగా ఉన్న తనను తప్పించాలనే కుట్ర చేశారని ఆమె అన్నారు. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పానని.. అందరూ తనను నమ్మి ఓటు వేశారని పేర్కొన్నారు. అమరావతిలో ప్రభుత్వం ఏం చేసిందని.. రైతులు, మహిళల నిరసనలు చూసి ఎంతో బాధపడేదాన్ని అని చెప్పారు. ఇక నుంచి తాను అమరావతి రైతులతో కలిసి పోరాడతానని.. ప్రాణం పోయినా వారికే తన మద్దతు అని స్పష్టం చేశారు. ఇసుక మాఫియాకు అడ్డువస్తున్నానని తనను పార్టీ నుంచి తప్పించారని అన్నారు. క్రాస్ ఓటింగ్‌ చేసి డబ్బులు తీసుకున్నారని ఆరోపిస్తున్నారని.. ఏ దేవుడి వద్ద అయినా ప్రమాణం చేసేందుకు తాను సిద్దమంటూ సవాల్ విసిరారు. 


Also Read: Rahul Gandhi: సంచలన నిర్ణయం.. రాహుల్ గాంధీపై వేటు.. పార్లమెంట్ సభ్యత్వం రద్దు  


Also Read: AP MLC Elections Results: సీఎం జగన్ డేరింగ్ స్టెప్.. ఆ ఇద్దరికి నో టికెట్.. ఓడిపోతామని తెలిసినా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి