సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్ధుల జాబితాలో టీడీపీ ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఇక ఏమాత్రం జాప్యం చేయకుండా ఒకే సారి 25 మంది అభ్యర్ధలను చంద్రబాబు ప్రకటించారు. అభ్యర్ది బలాబాలాలు, సీనియారిటీ, సామాజిక సమీకరణాలు తదితర అంశాలన పరిగణనలోకి తీసుకొని అభ్యర్ధులను ప్రకటించారు. టీడీపీ ప్రకటించిన అభ్యర్ధుల్లో ఆరుగురు కమ్మ, ఐదుగురు బీసీ, నలుగురు రెడ్డి, నలుగురు ఎస్సీ, ఇద్దరు క్షత్రియ, ఇద్దరు కాపులు, ఓ ఎస్టీ, మరో వైశ్య అభ్యర్ధి ఉన్నారు. 
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పది మంది సిట్టుంగులకు ఛాన్స్
టీడీపీ జాబితాలో పది మంది సిట్టింగ్‌లకు చోటు దక్కింది. ప్రస్తుత సభలో సభ్యులుగా ఉన్న కె.రామ్మోహన్‌నాయుడు, అశోక గజపతిరాజు, మాగంటి బాబు, కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రాయపాటి సాంబశివరావు, శ్రీరామ్‌ మాల్యాద్రి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు సిట్టింగ్‌ స్థానాల నుంచే మరోసారి బరిలో దిగనున్నారు. 

 


ఇద్దరు మహిళలకు ఛాన్స్
టీడీపీ ప్రకటించిన జాబితాలో ఇద్దరు మహిళలకు ప్రాతినిథ్యం కల్పించారు. రాజమహేంద్రవరం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాగంటి మురళీమోహన్‌ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆయన కోడలు రూప ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి తిరుపతి లోక్‌సభ టికెట్లు దక్కాయి. 

 


నలుగురు వారసులకు అవకాశం
టీడీపీ ప్రకటించిన  తాజా జాబితాలో  నలుగురు సీనియర్  నేతల వారసులు కూడా టికెట్లు దక్కించుకున్నారు. వీరిలో విశాఖపట్నం నుంచి మాజీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, సినీ నటుడు బాలకృష్ణ రెండో అల్లుడు శ్రీ భరత్ తొలిసారి చోటు దక్కంచుకున్నారు. గతంలో అమలాపురం నుంచి ఎంపీగా గెలిచి లోక్ సభ స్పీకర్‌గా కూడా పనిచేసిన జీఎంసీ బాలయోగి కుమారుడు గంటి హరీష్ మాథుర్‌కు అదే స్ధానం నుంచి అవకాశం కల్పించారు. అలాగే రాజమండ్రిలో సిట్టింగ్ ఎంపీ మాగంటి మురళీమోహన్‌కు బదులుగా ఆయన కోడలు రూపాదేవికి చోటు ఇచ్చారు. అనంతపురంలో టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి ఈసారి పోటీకి విముఖత చూపడంతో ఆయన స్ధానంలో కుమారుడు జేసీ పవన్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చారు.


అర్హతలే ప్రామాణికం..
టీడీపీ ఎంపీ జాబితాలో ఉన్నవారంతా దాదాపుగా పారిశ్రామిక వేత్తలే, ఉన్నత విద్యావంతులే కావడం గమనార్హం. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ వంటి వారికి కేంద్రమంత్రులుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.


లోక్‌సభ అభ్యర్ధుల జాబితా ఇదే...


శ్రీకాకుళం                     - కె.రామ్మోహన్‌నాయుడు
విజయనగరం              - అశోక గజపతిరాజు
విశాఖపట్నం               -  భరత్‌
అనకాపల్లి                    - అడారి ఆనంద్‌
అరకు (ఎస్టీ)                 -   వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌


కాకినాడ య                 -  చలమలశెట్టి సునీల్‌
అమలాపురం(ఎస్సీ)     - గంటి హరీష్‌
రాజమహేంద్రవరం      - మాగంటి రూప
నర్సాపురం                  - వి.వెంకట శివరామరాజు
ఏలూరు                       - మాగంటి బాబు


మచిలీపట్నం              - కొనకళ్ల నారాయణ
విజయవాడ                  - కేశినేని వెంకటేశ్వర్లు (నాని)
గుంటూరు                     - గల్లా జయదేవ్‌
నరసరావుపేట              - రాయపాటి సాంబశివరావు
బాపట్ల(ఎస్సీ)                 - శ్రీరామ్‌ మాల్యాద్రి


ఒంగోలు శిద్దా                 - రాఘవరావు
కడప                             -సీహెచ్‌  ఆదినారాయణరెడ్డి
నెల్లూరు                        - బీదా మస్తాన్‌రావు
నంద్యాల                      - ఎం.శివానందరెడ్డి
కర్నూలు                      - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి


రాజంపేట                    - డీకే సత్యప్రభ
అనంతపురం               - జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
హిందూపురం               - నిమ్మల కిష్టప్ప
తిరుపతి(ఎస్సీ)             - పనబాక లక్ష్మి
చిత్తూరు(ఎస్సీ)             - ఎన్‌.శివప్రసాద్‌