TDP Toll Free: మీ సమస్య సీఎం చంద్రబాబుకు చెప్పాలా? అయితే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి
TDP Announces Toll Free Number For Public Grievances: మీకు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలా? అయితే ఒక్క క్షణం ఆగండి.. ఒకే ఒక ఫోన్‌తో మీ సమస్యలను ముఖ్యమంత్రికి విన్నవించవచ్చు.
Telugu Desam Party Toll Free Number: అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే లక్ష్యంగా అచ్చం సినిమాలో మాదిరి ఓ కార్యక్రమం చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తమ సమస్యల గురించి విన్నవిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతోందని గుర్తించి దాని కోసం ఓ కార్యక్రమాన్ని టీడీపీ రూపొందించింది. ప్రజల వినతుల స్వీకరణ కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు ప్రకటించారు. ఆ టోల్‌ఫ్రీకి సంబంధించిన వివరాలు ఆదివారం వెల్లడించారు.
Also Read: Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన
మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పల్లా శ్రీనివాస రావు మాట్లాడారు. 'ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడకు వినతులు ఇచ్చేందుకు ప్రజలు పోటెత్తుతున్నారు. వారి వినతుల స్వీకరణ కోసం.. సులభతరం చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశాం. ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు 73062 99999కు ఫోన్ చేయాలి' అని సూచించారు. టోల్ ఫ్రీకి సమస్యలు తెలియజేస్తే సమస్య ప్రాధాన్యం.. తీవ్రతను బట్టి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో వినతుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Also Read: AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్.. మళ్లీ ఉద్యోగ అవకాశం?
గత ప్రభుత్వం జగన్ పాలనపై ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస రావు విమర్శించారు. పింఛన్‌దారులను ఐదేళ్లుగా జగన్ మభ్యపెట్టారని ఆరోపించారు. ఐదేళ్లలో జగన్ రూ.వెయ్యి పెంచి హడావుడి చేశారని.. చంద్రబాబు ఒకేసారి రూ.వెయ్యి పెంచి లబ్ధిదారులకు మేలు చేసినట్లు తెలిపారు. అమరావతిని త్వరితగతిన పూర్తి చేస్తామని.. విశాఖపట్టణాన్ని ఆర్థిక రాజధానిగా మారుస్తామని శ్రీనివాసరావు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలుగుదేశం, బీజేపీ, టీడీపీ ప్రభుత్వం రూ.వెయ్యి పింఛన్ పెంచి రూ.4 వేల పింఛన్ సోమవారం నుంచి పంపిణీ చేయనుండడం గమనార్హం. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించనుండడం విశేషం. ఏప్రిల్ నుంచి పెంచిన ఫించన్ ఇస్తామని చెప్పడంతో జూలై నెలకు రూ.7 వేల పింఛన్ లబ్ధిదారులు పొందనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter