AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్‌.. మళ్లీ ఉద్యోగ అవకాశం?

AP Volunteers Resignation Updates: ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్ల విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీనామాల విషయమై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 25, 2024, 07:25 PM IST
AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్‌.. మళ్లీ ఉద్యోగ అవకాశం?

AP Volunteers: ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పు వాలంటీర్ల వ్యవస్థ. వైసీపీ పాలనలో ప్రభుత్వ సేవలను ఇంటికి చేర్చిన వాలంటీర్లు ఎన్నికల సమయంలో రాజకీయంగా వివాదాస్పదమయ్యారు. ఎన్నికల సమయంలో రాజీనామాలు చేయడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో రాజీనామాలు చేసిన వాలంటీర్ల భవిష్యత్‌ ప్రమాదంలో పడింది. జగన్‌ వస్తే మళ్లీ తమ ఉద్యోగాలు వస్తాయని ఆశించగా.. టీడీపీ ప్రభుత్వం రావడంతో వారి ఉద్యోగాలు తిరిగి దక్కేలా లేవు. ఈ క్రమంలోనే రాజీనామాలు చేసిన వాలంటీర్లు మంత్రులు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాకుండా న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారి ఉద్యోగాల విషయంలో కీలక అప్‌డేట్ వచ్చింది.

Also Read: Hyper Aadi: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను వాడేసుకుంటున్న కమెడియన్ హైపర్ ఆది

 

ఎన్నికల సమయంలో మూకుమ్మడిగా 63 వేల మంది వాలంటీర్లు రాజీనామాలు చేయడంపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్‌ వేసిన పిటిషన్‌ తాజాగా మరోసారి మంగళవారం విచారణకు వచ్చింది. వారి రాజీనామాలు ఆమోదించవద్దని రామచంద్ర యాదవ్‌ అభ్యర్థించారు. ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను పిటిషనర తరఫు న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. వాలంటీర్ల రాజీనామాలు ఆమోదం చేయొద్దని మరోసారి కోరారు. 'ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ నాయకుల ప్రోద్బలంతో వారంతా రాజీనామాలు చేశారు. ఇప్పుడు తము ఉద్యోగాలకు తీసుకోవాలంటూ పోలీస్‌ స్టేషన్‌లను వాలంటీర్లు ఆశ్రయిస్తున్నారు. ఈ అంశం మీద ప్రస్తుత ప్రభుత్వ వైఖరి, కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తీసుకోవాలి' అని న్యాయస్థానాన్ని కోరారు.

Also Read: Pension Hike: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జూలై 1న పండగే.. ఒక్కొక్కరికి రూ.7 వేలు

 

పిటిషనర్‌ వాదనలతో ఏపీ ఉన్నత న్యాయస్థానం ఏకీభవించింది. పిటిషనర్‌ అభ్యర్థన మేరకు ధర్మాసనం వాలంటీర్ల రాజీనామాల విషయంలో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల సంఘం అభిప్రాయం తెలిపిన తర్వాత రాజీనామాలపై న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది.

కాగా రాజీనామాలు చేసిన వాలంటీర్లు తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. జూలై నెలకు సంబంధించిన ఫించన్లను గ్రామ, వార్డు అధికారులతో పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తమ ఉద్యోగాలు పోతాయని బెంబేలెత్తుతున్నారు. తమను కొనసాగించాలని వాలంటీర్లు కోరుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వాలంటీర్లు విజ్ఞప్తులు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News