Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన

Big Shock To YS Jagan Ali Resigned From YSR Congress Party: ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి మరో భారీ షాక్‌ తగిలింది. సినీ నటుడు అలీ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఏకంగా రాజకీయాలనే వదిలేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 28, 2024, 08:59 PM IST
Ali Resign: రాజకీయాలు నా వల్ల కాదు.. ఇక సినిమాలు చేసుకుంటా: అలీ సంచలన ప్రకటన

Comedian Ali Resigned YSRCP: అధికారం కోల్పోయిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని మరో నాయకుడు వీడాడు. పార్టీకే కాదు ఏకంగా రాజకీయాలనే త్యజించాడు. ఇకపై సినిమాలు మాత్రమే చేసుకుంటానని సినీ నటుడు అలీ సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ఏ రాజకీయ పార్టీ చెందిన వ్యక్తిని కాదని.. సాధారణ మనిషిగా ప్రకటించుకున్నాడు. ఈ మేరకు తన రాజీనామాను పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి పంపినట్లు తెలిపారు. కాగా రాజీనామా చేస్తూనే శుక్రవారం ఓ వీడియో విడుదల చేశారు.

Also Read: AP Volunteers వాలంటీర్ల రాజీనామాలపై కీలక అప్‌డేట్‌.. మళ్లీ ఉద్యోగ అవకాశం?

ప్రత్యక్ష రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా కొనసాగిన అలీ 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ అధికారంలోకి రావడంతో అలీకి భారీగా పదవులు లభిస్తాయని ప్రచారం జరిగింది. కానీ 2022లో ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు పదవి మాత్రమే లభించింది. అయినా కూడా పార్టీలోనే కొనసాగుతూ 2024 ఎన్నికల కోసం ఎదురుచూశారు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌ను ఆశించగా తీవ్ర నిరాశ ఎదురైంది. అసంతృప్తితో ఉన్న అలీ ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయలేదు. ఇక ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ అధికారం కోల్పోవడంతో అలీ పార్టీని వీడడమే కాకుండా రాజకీయాలను వదిలేయాలని నిర్ణయించుకోవడం విశేషం.

Also Read: Chandrababu: మళ్లీ జన్మ ఉంటే కుప్పం బిడ్డగా పుట్టి రుణం తీర్చుకుంటా: చంద్రబాబు భావోద్వేగం

ఈ సందర్భంగా వీడియోలో అలీ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 'నిర్మాత రామనాయుడు కోసం 1999లో రాజకీయాల్లోకి అడుపెట్టా. బాపట్ల ఎంపీగా ఆయన పోటీ చేయడంతో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసేందుకు టీడీపీలో చేరా. 20 ఏళ్లు టీడీపీలో కొనసాగి అనంతరం వైసీపీలో చేరాను. 45 ఏళ్లుగా 6 భాషల్లో 1200కు పైగా సినిమాల్లో నటించా. సహాయం చేసే గుణం ఉండడంతో దానికి రాజకీయ బలం తోడయితే మరింత సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చా. కానీ ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటా' అని అలీ సంచలన ప్రకటన చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News