Chandrababu Jagan Stone Attack: జగన్ విలాస పురుషుడు.. రాళ్ల దాడి కొత్త డ్రామా: చంద్రబాబు
Chandrababu Slams On YS Jagan Stone Attack: సీఎం జగన్‌పై రాళ్ల దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు `కొత్త డ్రామా`గా అభివర్ణించారు. జగన్‌ను విలాస పురుషుడు.. పేదల రక్తం తాగే జలగ అని తీవ్ర విమర్శలు చేశారు.
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్న సమయంలో వైఎస్సార్‌సీపీ అధినేత, సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరగడం తీవ్ర సంచలనంగా మారింది. ఈలోపు పవన్ కల్యాణ్‌పై కూడా రాయితో దాడి ఘటన జరగడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఈ ఘటనలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఎమ్మెల్యే అభ్యర్థి అనితకు మద్దతుగా ఆదివారం చంద్రబాబు ప్రచారం చేశారు.
Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్? లేదా స్టంట్.. ఘటనపై అనుమానాలు ఇవే..
ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ప్రజా గళం సభలో చంద్రబాబు మాట్లాడారు. 'ముఖ్యమంత్రి జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారు. ఎన్నికల ముందు రాళ్ల దాడి అంటూ కొత్త డ్రామా తెరపైకి తీసుకొచ్చారు. రాజ్యాంగo మంచిదైనా అమలు చేసేవారు మంచివారు కాకపోతే ప్రయోజనం లేదు' అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలాంటి వారి గురించి ఎప్పుడో చెప్పారని తెలిపారు.
Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్.. హెలికాప్టర్ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది
'జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా కాంక్రీట్ వేయాలి. దళిత ద్రోహి జగన్. వైసీపీది చెత్త పరిపాలన ఇది' అని చంద్రబాబు తెలిపారు. ఉత్తరాంధ్రకు జగన్ ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. 'జగన్ విలాస పురుషుడు.. భారీ భవంతి కట్టుకున్నారు. పేదలకు అగ్గిపెట్టె అంత ఇల్లు కట్టారు' అని అభివర్ణించారు. జగన్ దుర్మార్గుడు అని.. అన్ని కంపెనీలు తరిమేశాడు అని విమర్శించారు. 'విశాఖపట్టణాన్ని గంజాయికి రాజధానిగా చేశాడు. విశాఖలో భూములు దోచేశారు' అని ఆరోపించారు.
జగన్ పాలనపై చంద్రబాబు విమర్శిస్తూ.. 'విద్యుత్ చార్జీలు పెంచారు. నాసిరకం మద్యం తీసుకువచ్చి.. ధరలు పెంచి పేదల రక్తం జలగలా తాగుతున్నారు. కుంభకోణం చేసిన వారిని వదిలిపెట్టం' అని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామోనని చంద్రబాబు వివరించారు. 'మేం అధికారంలోకి ఉచిత ఇసుక ఇచ్చి ఆదుకుంటా' అని హామీ ఇచ్చారు. జగన్ పది ఇచ్చి, వంద కొట్టేస్తాడు అని తెలిపారు. 'అధికారంలోకి వచ్చాక నేను అప్పు తీసుకురాను. కానీ సంపద సృష్టిస్తా.. అది మీకే పంచుతాను. సూపర్ సిక్స్ అమలు చేస్తాం' అని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter