One Nation One Election: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మద్దతు ప్రకటించారు. ఒక దేశం ఒక రాష్ట్రం అనే విధానానికి మద్దతునిచ్చారు. ‘వన్ నేషన్... వన్ ఎలక్షన్ అనే మోదీ ఆలోచనను బలపరుస్తామని తెలిపారు. పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Shock To YSRCP: డోర్లు తెరిచిన సీఎం చంద్రబాబు.. టీడీపీలోకి వైసీపీ మాజీ ఎంపీలు


 


నరేంద్రమోదీ సారథ్యంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడం, హర్యానాలో మూడోసారి బీజేపీ గెలుపొందాయని సీఎం చంద్రబాబు తెలిపారు. బీజేపీ నేతలు సమష్టిగా పనిచేయడంతోనే హర్యానా ఎన్నికల్లో చరిత్రాత్మకమైన విజయాన్ని బీజేపీ సాధించిందని చెప్పారు. మంచి పనులు చేస్తే ఎలా మెజారిటీ పెరుగుతుందో ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రాబోయే జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికల్లోనూ మంచి ఫలితాలే వస్తాయని జోష్యం చెప్పారు.


దేశ, రాష్ట్ర పరిణామాలపై ఉండవల్లిలోని నివాసంలో బుధవారం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. 'వన్ నే షన్ , వన్ ఎలక్షన్' అనేది ఎన్డీఏ విధానం. ప్రతి ఆరు నెలలు, సంవత్సరానికి కాకుండా స్థానిక సంస్థలు సహా అన్నింటికీ ఒకే సారి ఎన్నికలు జరగాలి' సీఎం చంద్రబాబు తెలిపారు. వికసిత్ భారత్ -2047తో భారత్  మొదటి లేదా రెండో అతిపెద్ద వ్యవస్థ దేశంగా తయారవుతుంది’ అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.


‘ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ సహా ఏడుగురు కేంద్రమంత్రులను కలిశాను. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి కేంద్ర సాయం అవసరం. సంక్షేమం, అభివృద్ధి సమంగా తీసుకెళ్లాలి. మోదీ మూడోసారి గెలవడమే కాకుండా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. దక్షిణ భారతదేశంలో పెడితే చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్, అమరావతిని కలుపుతూ బుల్లెట్ ట్రైన్ వస్తే 4 కోట్ల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. పొత్తు పెట్టుకుని రాష్ట్ర అవసరాల కోసమే కాకుండా దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.


‘విజయవాడలో వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. 10 రోజులు బురదలోనే ఉన్నాము. రూ.450 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధి వచ్చాయి. ఇదో చరిత్ర. నా రాజకీయ చరిత్రలో ఇంత పెద్ద మొత్తం రావడం ఎప్పుడూ చూడలేదు. ప్రతి ఒక్కరూ తోచిన సాయం చేశారు’ అని సీఎం చంద్రబాబు వివరించారు. 'విశాఖలో భోగాపురం, మూలపాడు, కుప్పం నుంచి బెంగుళూరుకు రహదారులు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుపై రిపోర్టులు ఇచ్చాం’ అని తెలిపారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి