లోకేష్ Vs కేటీఆర్: షర్మిల వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఎటాక్
తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పోల్చుతూ నారా లోకేష్ సామర్ధ్యాన్ని ప్రశ్నించిన షర్మిల వ్యాఖ్యలకు టీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. ప్రెస్ మీట్ లో టీడీపీ సీనియర్ నేత రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నారా లోకేష్ పై షర్మిల చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామన్నారు. వాస్తవాలను పక్కన పెట్టి షర్మిల అబద్దాలు మాట్లాడుతున్నారని విరమ్శించారు
ఇది లోకేస్ సత్తా...
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ...మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లోకేష్ అద్భుత పనినీరు కనబర్చారని సమర్ధించారు. మంత్రి లోకేష్ కు ఐటీ విభాగంలో 57 అవార్డు వచ్చాయి..ఇవి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులు అని గుర్తు చేశారు. ఈ విషయంలో కేటీఆర్ కు ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పాలని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
కేటీఆర్ ఏం చేశారు..
లోకేష్ గ్రామీణ పంచాయితీ రాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత 106 అవార్డు అందుకున్నారు.. ఇది రాష్ట్ర ప్రభుత్వమో.. చంద్రబాబు ఇచ్చిన అవార్డుల కావని.. కేంద్ర సంస్థలు.. అంతర్జాతీయ సంస్థలు ఇచ్చిన పురస్కారాలని వివరించారు. లోకేష్ మంత్రిగా ఉన్న మూడేళ్ల కాలంలోనే దాదాపు 160 అవార్డులు సొంతం చేసుకున్నారని తెలిపారు.. లోకేష్ పనితీరు ఏపాటిలో ఉందో.. ఆయన సత్తా ఏ పాటిదో ఈ అవార్డులే అందుకు నిరద్శనమన్నారు. షర్మిల చుట్టరికం కలుపుకొని వెనుకేసుకు వస్తున్న కేటీఆర్ కు ఎన్ని అవార్డులు వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు
వీళ్ల బంధం మరోసారి బయటపడింది..
కేసీఆర్ తో వైసీపీ సంబంధాలు ఏపాటిలో ఉన్నాయో షర్మిల వ్యాఖ్యలే అందుకు నిరద్శనమని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీని దెబ్బతీసేందుకు ఏపీ ప్రయోజనాలకు వ్యతిరేకులైన టీఆర్ఎస్ తో చేతులు కలపడం సిగ్గు చేటు అని విమర్శించారు. జగన్ అన్న వదలిన భాణం షర్మిల..చివరకు అన్నకే గాయాపర్చుతోందని రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవ చేశారు.