Chandrababu Arrest: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో ఏపీ సీఐడీ పోలీసులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అరెస్టు చేశారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్ని నిలిపివేసింది. చంద్రబాబుపై నమోదైన సెక్షన్లు ఏంటి, ఈ స్కాం ఏంటనేది తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014-2019 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ పేరుతో కుంభకోణం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు శిక్షణలో భాగంగా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ 2021 జూలైలో విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సీఐడీ నివేదిక ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సైతం దృష్టి సారించింది. 


ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం జర్మనీకు చెందిన సీమెన్ సంస్థతో 3,350 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా చెల్లించాల్సిన పది శాతంలో 240 కోట్లను దారి మళ్లించినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా నకిలీ బిల్లులతో జీఎస్టీకు కూడా ఎగనామం పెట్టారని మరో ఆరోపణ ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఈడీ 26 మందికి నోటీసులు కూడా జారీ చేసింది. 


ఇవాళ ఉదయం 6 గంటలకు నంద్యాలలో చంద్రాబుని అరెస్టు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు అందుకు సంబంధించిన నోటీసు కూడా ఆయనకు ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రాబుతో పాటు ఆయన న్యాయవాదులు సీఐడీ అధికారులతో వాదనకు దిగారు. రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాల్ని నివృత్తి చేస్తామని చెప్పడంతో చంద్రబాబు సహా ఆయన న్యాయవాదులు ఇంకేం మాట్లాడలేదు. 


చంద్రబాబుపై నమోదైన సెక్షన్లు ఇవే


120 (బి) 166, 167, 418,420, 465,468, 471, 409, 201, 109 రెడ్ విత్ 34, 37 ఐపీసీ మరియు 1988 అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 12, 13 ( 2) రెడ్ విత్ 13(1)(సి),(డి) నమోదు చేసినట్టు చంద్రబాబుకు ఏపీ సీఐడీ డిప్యూటీ సూపరింటెండెండ్ ధనుంజయుడి పేరుతో జారీ చేసిన నోటీసులో ఉంది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 6 గంటలకు నంద్యాలలోని ఆర్కే ఫంక్షన్ హాల్‌లో నాన్ బెయిలబుల్ నేరం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేస్తున్నట్టుగా వివరించారు.


మరోవైపు ఇదే కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో గుంటూరుకు చెందిన ఘంటా సుబ్బారావు, డాక్టర్ కే లక్ష్మీ నారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ పేర్లు మొదటి మూడు అనుమానితులుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని 37వ నిందితుడిగా పేరొన్నట్టు చంద్రబాబు న్యాయవాది తెలిపారు. 


Also read: Chandrababu Arrest: నంద్యాలలో చంద్రబాబు అరెస్టు, రాష్ట్రవ్యాప్తంగా బస్సులకు బ్రేక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook