తన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌పై టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు విషయం టీవీ చూసే తెలుసుకున్నానని, రేపు తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం అక్కర్లేదన్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి ఎవరు ఎదరుచెప్పినా ఇదే పరిస్థితి తలెత్తుతుందన్నారు. ప్రతిపక్షమైనా, స్వపక్షమైనా ఫలితం మాత్రం ఇలాగే ఉంటుంన్నారు.  హోమ్ క్వారంటైన్‌లోకి మంత్రి హరీష్ రావు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో అసలు ఏం జరుగుతోందో అందరికీ తెలుసునని, ఎవరైతే తమ దారిలోకి రారో అలాంటి వారిపై ఇదేతీరుగా కక్షసాధింపు చర్యలు ఉంటున్నాయని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్ ఎవరికీ, దేనికీ భయపడే వ్యక్తి కారని, రేపు తనును కూడా అరెస్టు చేసినా ఆశ్చర్యపోలేమన్నారు. తమ ఆర్థిక మూలాలన్నీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) నాశనం చేస్తున్నారని, దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy)కి బైపాస్ సర్జరీ అయిందని, ఆరోగ్యం సరిగా లేదని జేసీ దివాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. TDP నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్