Nara Lokesh Yuvagalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి యువగళం పేరుతో పాదయాత్రను మొదలు పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో లోకేష్ పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరీ, మామయ్య నందమూరి బాలకృష్ట దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు నారా లోకేష్‌. అనంతరం లోకేష్ భార్య బ్రాహ్మణి వీర తిలకం దిద్ది హారతి ఇచ్చారు. ఇతర కుటుంబ సభ్యులు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ కావాలని కోరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటి నుంచి పాదయాత్రకు బయలుదేరే ముందు ఇంటి వద్ద ఉద్విగ్న వాతవారణం నెలకొంది. కుమారుడు దేవాన్ష్‌ను నారా లోకేష్ గట్టిగా హత్తుకున్నారు. చంద్రబాబు కళ్లలో నీళ్లు తిరగ్గా.. భువనేశ్వరీ కూడా భావోద్వేగానికి గురయ్యారు. పాదయాత్ర విజయవంతం అవ్వాలని ఇంట్లో పూజలు నిర్వహించిన నారా లోకేష్.. అనంతరం టీడీపీ కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు లోకేష్ ర్యాలీగా వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నివాళి అర్పించారు. అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి ఏపీకి బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. 


ఈ సందర్భంగా నారా లోకేష్ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'ఈరోజు నా జీవితంలో ఎంతో ఉద్విగ్నమైన క్షణాలను అనుభవించాను. జనం కోసం 400 రోజుల పాదయాత్రకు బయలుదేరేముందు కుటుంబ సభ్యులకు వీడ్కోలు చెబుతుంటే మాటలకందని భావోద్వేగాలు మనసును ముంచెత్తాయి. దేవాన్ష్‌కు ముద్దులు పెట్టి అమ్మానాన్నలకు పాదాభివందనం చేశాను.


అమ్మానాన్నలు మౌనంగా కౌగలించుకున్నప్పుడు ఆ మనసుల తడి తెలిసింది. బాలామావయ్య, అత్తయ్యలతో పాటు ఇతర కుటుంబసభ్యులు, బంధువుల ఆశీర్వాదాలు తీసుకున్నాను. బ్రాహ్మణి చేతుల మీదుగా విజయహారతి అందుకుని ర్యాలీగా ఎన్టీఆర్ ఘాట్‌కు బయలుదేరాను. తాతకు పుష్పాంజలి ఘటించి ఆశీర్వాదాలు అందుకున్నాను..' అని నారా లోకేష్ రాసుకొచ్చారు.




యువగళం పేరుతో ఈ నెల 27 నుంచి పాదయాత్రను మొదలుపెట్టనున్నారు నారా లోకేష్. కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు దాదాపు 400 రోజులపాటు 4వేల కిలో మీటర్ల మేర రాష్ట్రవ్యాప్తంగా ఆయన పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని టచ్‌ చేస్తూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా రూట్ మ్యాప్ సిద్ధమైంది. 


Also Read:  IND Vs NZ: శార్దూల్ ఠాకూర్‌పై రోహిత్ శర్మ సీరియస్.. బంతి ఇలానే వేసేదంటూ.. 


Also Read: Pawan Kalyan: పవన్ పర్యటనలో 108 అంబులెన్స్ సైరన్.. వెంటనే వాహనాలు నిలిపివేసి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook