Nara Lokesh slams AP CM YS Jagan: అమరావతి: వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్టుపై స్పందిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై ట్విటర్ వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, సీఎం జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ ప‌ట్టించుకోకుండా, త‌న క‌క్ష తీర్చుకోవ‌డానికే అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్న మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ రెడ్డి అని అసహనం వ్యక్తంచేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారని (Sedition charges) ఆయన్ని అరెస్ట్ చేసినట్టయితే.. జ‌గ‌న్ రెడ్డి స‌ర్కారుపై తమకు విశ్వాసం లేద‌ని 5 కోట్ల ఆంధ్రులూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారు. మరి వారిని అందరినీ అలాగే అరెస్ట్ చేస్తారా అని నారా లోకేష్ ప్రశ్నించారు. ఏడేళ్ల లోపు శిక్ష ప‌డే కేసుల్లో అరెస్టులు చేయొద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశించినా లెక్క చేయ‌కుండా వై కేట‌గిరి భ‌ద్ర‌త‌లో వుంటూ ఇటీవ‌లే బైపాస్ స‌ర్జ‌రీ చేసుకున్న సొంత పార్టీ ఎంపీని ఆయ‌న పుట్టిన‌ రోజు నాడే అరెస్ట్ చేయించ‌డం జ‌గ‌న్‌ రెడ్డి సైకో మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం. ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్ (CID) కాస్తా సీఎం ఇండివిడ్యువ‌ల్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయింది అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. 



Also read : MP Raghuramakrishnam Raju arrest: ఎంపీ రఘురామ కృష్ణ రాజు అరెస్ట్.. ఆంధ్రాకు తరలింపు


రఘురామ కృష్ణం రాజు అరెస్టును నిరసిస్తూ వరుస ట్వీట్స్ చేసిన నారా లోకేష్ (Nara Lokesh)... '' ప్ర‌శ్నిస్తే సీఐడి అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేర‌క‌పోతే జేసీబీతో ధ్వంసం,లొంగ‌క‌పోతే పీసీబీ త‌నిఖీలు. ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌ రెడ్డి పాల‌న‌. జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును అరెస్ట్ (Raghurama Krishnam Raju arrest) చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను'' అంటూ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు.


Also read : Sputnik V Vaccine Cost: రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి ధర ప్రకటించిన రెడ్డీస్ ల్యాబ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook