Paritala Sunitha: మాది సీమ రక్తమే..రక్తం ఉడుకుతోంది: పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మరియు చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటితో పాటుగా వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు.
Paritala Sunitha Sensational Comments on Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కుతుంది.. ఇటు టీడీపీ (TDP) నేతలు.. అటు వైసీపీ (YCP) నేతల మధ్య మాటల యుద్ధం మొదలవుతుంది. పట్టాభి వ్యాఖ్యలతో రెండు పార్టీల మధ్య షురు అయిన గొడవ.. బంద్ నిరసనలు, అరెస్టులతో వేడెక్కింది. చంద్రబాబు (Chandrababu) దీక్ష కొనసాగిస్తుండగా.. అటు వైసీపీ నేతలు జనాగ్రహ దీక్ష కొనసాగిస్తున్నారు.
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunitha) గారు సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు సరే అంటే ఏదైనా చేయటానికి సిద్ధం అని.. ఒక గంట కళ్లు మూసుకుంటే వేరేలా ఉంటుంది అని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. మాది సీమ రక్తమేనని.. రక్తం ఉడుకుతోంది.. భర్తను చంపినపుడు (Paritala Ravi) కూడా చంద్రబాబు గారు ఓర్పుగా ఉన్నామన్నారు.. వారి పైన గౌరవంతోనే హోపికగా ఉన్నామని... ఇక నిన్నా చంద్రబాబు గారు మీరు మారాలని మాజీ మంత్రి సూచించారు.
Also Read: India Covid Updates: కొత్తగా 15,786 వేలకేసులు.. 231 మరణాలు.. 98.16% రికవరీ రేటు!
ఇన్నాళ్లు ఓపికగా పడుతున్నామంటే దానికి కారణం చంద్రబాబు.. ఇంకా ఓపికతో ఉండలేము.. నా భర్తను చంపినా వారు రోడ్లపై తిరుగుతున్న చంద్రబాబు పై ఆన్న గౌరవంతో ఎన్నడూ గొడవలు పడలేదని.. మారిన చంద్రబాబు కావాలి.. మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలని ఆమె వ్యాఖ్యానించారు.
దేవినేని ఉమా (Devineni Uma) సైతం సీఎం జగన్ (CM Jagan) మరియు వైసీపీ నేతల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీ మంత్రులు మా పార్టీ నేతలను భూతులు తిడుతున్నారని.. మేము మళ్లీ అధికారంలోకి వస్తామని.. అది గుర్తు పెట్టుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలకు దేవినేని ఉమా వార్నింగ్ ఇచ్చారు. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్.. ఏపీ మంత్రులను తగిన పద్దతిలో సమాధానం చెప్తామని వెల్లడించారు.
Also Read: Prabhas New Look: రాధేశ్యామ్ నుండి ప్రభాస్ న్యూ లుక్.. లీకైన రాధేశ్యామ్ టీజర్ పిక్స్..??
ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు తిరుపతిలో (Tirupathi) చేప్పట్టిన జనాగ్రహ దీక్ష రెండో రోజు కొనసాగుతుంది, తిరుపతిలోని సెంట్రల్ పార్క్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు చంద్రబాబు దిష్టిబొమ్మకు పాడే కట్టి శవయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేసారు వైసీపీ కార్యకర్తలు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook