Balakrishna: ఓట్లు వేసి గెలిపిస్తే..నీలి చిత్రాలు చూపించారు..గోరంట్ల మాధవ్‌పై బాలకృష్ణ ఫైర్..!
Balakrishna: ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం హీట్ పుట్టిస్తోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు.
Balakrishna: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. గోరంట్ల మాధవ్ సభ్య సమాజం తలదించుకునే పని చేశారన్నారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే..ప్రజలకు సేవ చేయకుండా నీలి చిత్రాలు చూపించారని మండిపడ్డారు. ఇంత పని చేసి ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురం వచ్చారని ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగురవేసే అర్హత లేదన్నారు.
ఎంపీ గోరంట్ల మాధవ్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతకాని పాలనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ విమర్శించారు. భారీగా అప్పులు చేస్తూ..అదే అభివృద్ధి అని చెప్పడం ఏంటన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయారని చెప్పారు.
సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఆయన పర్యటించారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగసభలో వైసీపీ నేతలు, గోరంట్ల మాధవ్‌పై మండిపడ్డారు. అంతకముందు హిందూపురానికి వచ్చిన బాలకృష్ణకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తూముకుంట చెక్‌పోస్ట్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం చలివెందులలో ఎన్టీఆర్ ఉచిత ఆరోగ్య రథాన్ని ఆరంభించారు.
ఇటీవల సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ మహిళతో న్యూడ్‌గా మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాసేపటికే వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా షేర్లు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. దీనిని ఆయన ఖండించారు.
కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని..వీడియోను మార్ఫింగ్ చేశారని తెలిపారు. న్యూడ్ వీడియోపై వైసీపీ అధిష్టానం సైతం స్పందించింది. వీడియో నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. వీడియో తనను చూపించారంటూ ఓ మహిళ అనంతపురం జిల్లా పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఒరిజినల్ వీడియో దొరకాల్సి ఉందన్నారు. మరోవైపు ఈవ్యవహారం తర్వాత సొంత నియోజకవర్గానికి వచ్చిన గోరంట్ల మాధవ్‌కు రాయలసీమలో ఘన స్వాగతం లభించింది.
Also read:CM Jagan Review: అంతా వైద్య కళాశాలల నుంచే..వైద్యారోగ్య శాఖలో కీలక సంస్కరణాలు..!
Also read:Constable Recruitment: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్..ఇలా హాల్ టికెట్లు పొందండి..!
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook