హైదరాబాద్: 2014 లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నుంచి టీడిపి తరపున ఎంపీగా గెలిచిన తోట నరసింహం తాజాగా ఆ పార్టీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్‌ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో తోట నరసింహం ఆ పార్టీలో చేరారు. తోట నరసింహంతోపాటు ఆయన సతీమణి వాణి, ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ), సినీ నటుడు రాజా రవీంద్రలకు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"177490","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


పార్టీలో చేరిన అనంతరం పీవీపి మీడియాతో మాట్లాడుతూ.. తాను విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీచేస్తున్నట్టు స్పష్టంచేశారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోనే తాను వైఎస్సార్సీపీలో చేరానని పీవీపి తెలిపారు.