ఆందోళన మధ్య బడ్జెట్ ఆమోదించుకున్నోళ్లు..అవిశ్వాసంపై చర్చ ఎందుకు చేపట్టరు
అవిశ్వాసంపై చర్చ జరపకుండా సభను వాయిదా వేయడంతో పార్లమెంటు ఆవరణలో తెదేపా ఎంపీలు ధర్నాకు దిగారు. అవిశ్వాసంపై చర్చ జరగకుండా కేంద్రం కుట్ర పన్నిందని టీడీపీ ఎంపీలు ఆరోపిస్తున్నారు. ఆందోళన చేపట్టిన సభ్యులను నియత్రించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పందిస్తూ .. ఆందోళన మధ్యే బడ్జెట్ ను ఆమోదించుకున్న కేంద్రం.. అవిశ్వాస తీర్మానంపై చర్చ ఎందుకు చేపట్టలేకపోతోందని కేంద్రాన్ని ప్రశ్నించారు. మోడీ సర్కార్ కావాలనే అవిశ్వాస తీర్మానానికి అడ్డంకులు సృష్టిస్తోందని జేసీ విమర్శించారు. ఏపీ విషయంలో కట్టు కథలు చెప్పడం తప్పితే..సమస్యల పట్ల కేంద్రానికి చిత్తశుద్ధి లేదని ఎంపీ మురళీ మోహన్ విమర్శించారు. అంత చేశాం.. ఇంత చేశాం అని గొప్పలు చెబుకుంటున్న కేంద్రం .. ఈ విషయాన్ని పార్లమెంట్లో లెక్కలు చెప్పడానికి ఎందుకు తడబడుతోందని ఎంపీ ముళీమోహన్ ప్రశ్నించారు
.