Chandrababu Naidu on Jagananna Amma Vodi Scheme: అమ్మఒడి పథకం పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'ఎన్నికలకు ముందు మాటలు...నేటి కోతల'పై నిలదీస్తూ  ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు చంద్రబాబు నాయుడు  ట్వీట్ చేశారు. అమ్మఒడిపై సైతం నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలే కదా జగన్ రెడ్డీ అంటూ నిలదీశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో అమ్మఒడి పథకానికి లబ్దిదారులు 83 లక్షల మంది పైగా ఉంటే.. మీరు ఇచ్చేది ఎంతమందికి..? అని ప్రశ్నించారు. ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికీ రూ.15 వేలు చొప్పున ఇస్తానని ఎన్నికలకు ముందు చెప్పింది వాస్తవం కాదా..? ఇద్దరు బిడ్డలు ఉంటే.. ఒక్కరికే పథకం ఇవ్వడం వివక్ష కాదా..? అని అడిగారు.


"ఇప్పుడు ఇస్తున్నది ఎంత.. దాంట్లో కోస్తున్నది ఎంత..? 300 యూనిట్ల కరెంట్ వాడారని, 75 శాతం హాజరు లేదని.. ఇంట్లో వారికి కారు (జీవనోపాధిగా ఉండే టాక్సీ) ఉందని.. ఇలా సవాలక్ష కొర్రీలతో కోతలు పెడుతున్నది నిజం కాదా కోతల రాయుడూ..? పాఠశాలల నిర్వహణ పేరుతో పథకానికీ కోతలు పెట్టిన ఘనత నీకే దక్కుతుంది.  విద్యారంగంపై మీ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. విద్యా ప్రమాణాలు మాత్రం గడప దాటడం లేదు. 


అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో మీరు చేసే దోపిడీకి సమాధానం చెప్పగలరా..?" అని చంద్రబాబు ప్రశ్నించారు. విద్యతోనే బతుకు మారుతుందని బలంగా నమ్మే తాము అధికారంలోకి వచ్చిన తరువాత 'తల్లికి వందనం' పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు.


2022–23 విద్యా సంవత్సరానికి సంబంధించి బుధవారం జగనన్న అమ్మ ఒడి పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్ మోహన్ రెడ్డి రూ.13 వేలు జమ చేశారు. కురుపాంలో నిర్వహించిన బ‌హిరంగ స‌భ వేదిక‌గా బటన్ నొక్కి జమ చేశారు. రాష్ట్రంలో 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో మొత్తం రూ.6,392.94 కోట్లు పది రోజుల్లో జమ కానున్నాయి. ఒకటో తరగతి నుంచి నుంచి ఇంటర్మీడియట్‌ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.  


Also Read: Types Of Bank Accounts: ఒక వ్యక్తి ఎన్ని బ్యాంక్‌ అకౌంట్‌లు ఓపెన్ చేయవచ్చు..? ఎన్ని రకాల ఖాతాలు ఉన్నాయి..?  


Also Read: India ODI World Cup 2023 Schedule: ప్రపంచకప్‌లో టీమిండియా ఫుల్‌ షెడ్యూల్ ఇదే.. సెమీస్‌ వరకు రూట్‌ మ్యాప్ రెడీ  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook