ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి సూచనల మేరకు పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు నిరసన చేపట్టారు. సోమవారం పార్లమెంట్ లోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిలబడి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలు నిరసన ప్రదర్శించారు. విభజన చట్టంలోని అన్ని అంశాలను, పెండింగ్ లో ఉన్న సమస్యలను నెరవేర్చడానికి కేంద్రం చర్యలను వేగవంతం చేయాలని టీడీపీ ఎంపీలు కోరారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలు, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులతో ఆదివారం అమరావతిలో సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ రాష్ట్రానికి మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తుందని సమావేశం అనంతరం నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నేడు టీడీపీ ఎంపీలు పార్లమెంట్ వేదికగా నిరసన ప్రదర్శన చేపట్టారు. 


ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఫిబ్రవరి 1వ తేదీన సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2018లో ఏపీకి జరిగిన అన్యాయంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..! పార్టీ మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో సంబంధాలను సమీక్షించేందుకు సమావేశానికి పిలుపునిచ్చినట్లు వార్తలు కూడా వచ్చాయి.